T20 World Cup 2024 SA vs India: ఆరంభ టీ 20 ప్రపంచకప్‌ను ఎగరేసుకున్న భారత్‌ 17 ఏళ్లుగా మళ్లీ కప్‌ను చేజిక్కించుకోలేదు. త్రుటిలో చేజారిన పరిస్థితులు చాలానే ఉండగా.. తాజాగా మరో అవకాశం లభించింది. అజేయంగా గ్రూప్‌, సూపర్‌ 8 మ్యాచ్‌లను ముగించి ఫైనల్‌ చేరిన టీమిండియా పొట్టి కప్‌నకు ఒక్కడుగు దూరంలో ఉంది. గతేడాది వన్డే ట్రోఫీని చేజార్చుకున్న భారత్‌ ఈసారి దక్షిణాఫ్రికా నుంచి కప్‌ను చేజిక్కించుకుంటుందా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. గణాంకాల పరంగా భారత్‌దే పైచేయి కనిపిస్తున్నా.. టీ20 మ్యాచ్‌ల్లో ఏమైనా జరగవచ్చనే ఆందోళన భారత అభిమానులను కలవర పెడుతోంది. అయితే భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: T20 World Cup 2024 Ind vs Eng: ఇండియా ఇంగ్లండ్ మ్యాచ్ గయానా పిచ్ ఎలా ఉంది, మ్యాచ్ రద్దయితే ఎవరికి లాభం


తాజా మెగాటోర్నీని పరిశీలిస్తే భారత్‌ సునాయాసంగా ఫైనల్‌కు చేరుకోగానే.. దక్షిణాఫ్రికా మాత్రం పోరాడుతూనే ఆఖరి మెట్టుకు చేరుకోగా.. భారత్‌ మాదిరే ఒక్క ఓటమి లేకుండా చేరుకోవడం విశేషం. 20 ప్రపంచకప్‌లో ఆరుసార్లు ఇరు జట్లు తలపడగా.. నాలుగింట భారత్‌, రెండింట్లో సఫారీ జట్టు గెలిచింది. ఇలా రెండూ సమ ఉజ్జీలుగానే ఉన్నాయి. భారత్‌ను విజయం ఊరిస్తున్నా సఫారీలు తొలి కప్‌ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: AFG Vs BAN Highlights: చరిత్ర సృష్టించిన అఫ్గాన్.. బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ నుంచి ఆసీస్ ఔట్


భారత్‌ బలం-లోపాలు
వన్డే కప్‌ను చేజార్చుకున్న కసిని భారత్‌ ఈ టోర్నీలో కనబరుస్తోంది. గ్రూపు, సూపర్‌ 8 స్టేజ్‌లో భారత్‌ సులువుగా సెమీస్‌కు చేరుకుంది. ఒక్క మ్యాచ్‌ ఓడకుండా మనోళ్లు తుది పోరుకు చేరుకున్నారు. కెప్టెన్‌గా జట్టు బాధ్యతలు మోస్తూనే రోహిత్‌ శర్మ బ్యాటర్‌గాను సత్తా చాటుతున్నాడు. 33 పరుగులు చేస్తే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు. ప్రస్తుతం 248 పరుగులతో ముందంజలో ఉన్నాడు. ఆ పరుగులు చేస్తే అఫ్గానిస్తాన్‌ బ్యాటర్‌ గుర్బాజ్‌ 281 రికార్డును చెరిపేయనున్నాడు. ఇక సూర్య కుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్నారు. కాగా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ప్రదర్శన తీవ్ర లోటుగా కనిపిస్తోంది. కోహ్లీ రాణిస్తే మాత్రం భారీ స్కోర్‌ సాధ్యమయ్యే అవకాశం ఉంది. ట్రోఫీ కోసం కోహ్లీ ఫామ్‌ అందుకోవాల్సిన అవసరం ఉంది.

బౌలింగ్‌
బౌలింగ్‌ విషయానికి వస్తే అర్ష్‌దీప్‌ సింగ్‌ టాప్‌ బౌలర్‌గా నిలవనున్నాడు. మరో మూడు వికెట్లు తీస్తే చాలు. ఫైనల్లో సఫారీలను బౌలింగ్‌తో బోల్తా కొడితే 17 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్న ఫరూఖీని అర్ష్‌దీప్‌ వెనక్కి నెట్టే అవకాశం ఉంది. బుమ్రా 13 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.


దక్షిణాఫ్రికా బలం-లోపాలు
పొట్టి ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. అయితే గ్రూపు, సూపర్‌ 8 మ్యాచ్‌ల్లో తీవ్రంగా శ్రమించి విజయం సాధించింది. అయితే సెమీ ఫైనల్లో మాత్రం అఫ్ఘానిస్తాన్‌ సులువుగా విజయం సాధించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అయితే సఫారీ జట్టు సమిష్టిగా రాణిస్తుండడం విశేషం. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ పరంగా అన్నింటా చక్కటి ప్రదర్శన కనబరుస్తోంది. బ్యాటర్లు అందరూ తమ వంతు పాత్ర పోషిస్తుండడంతో ఈ టోర్నీలో ఏ బ్యాటర్‌ కూడా టాప్‌-5 స్కోరర్‌ జాబితాలో ఎవరూ లేరు. క్వింటాన్‌ డికాక్‌ 204 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. మార్‌క్రమ్‌, హెండ్రిక్స్‌, క్లాసెన్‌, మిల్లర్‌, స్టబ్స్‌ విలువైన ఇన్నింగ్స్‌ ఆడుతున్నారు.

బౌలింగ్‌తో బెంబేలు
బౌలింగ్‌లో సఫారీ జట్టు బలంగా ఉంది. భారత బ్యాటర్లకు దక్షిణాఫ్రికా బౌలర్లు పెను సవాలే విసిరే అవకాశం ఉంది. నోకియా (13), రబాడ (12), షంసీ (11) ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. కొత్త బౌలర్‌ బార్ట్‌మన్‌ కూడా దూకుడుతో ఉన్నాడు. స్పిన్నర్‌ షంసీ కీలకమైన సమయంలో వికెట్లు తీసి ప్రత్యర్థిని భారీగా దెబ్బతీస్తున్నాడు.


ఉత్కంఠ ఆపుకోవాల్సిందే..
గణాంకాల పరంగా భారత్‌ బలంగా ఉన్నా కూడా దక్షిణాఫ్రికా కూడా అదే స్థితిలో ఉండడంతో తుది పోరును సమ ఉజ్జీల పోరుగా చెప్పవచ్చు. ఆఖరి యుద్ధంలో గెలిచి భారత్‌ రెండో ట్రోఫీని తీసుకువస్తుందా? లేదా సమిష్టి సూత్రంతో సత్తా చాటుతున్న తొలిసారి పొట్టి కప్‌ను ముద్దాడుతుందా అనేది శనివారం రాత్రి వరకు ఎదురుచూడాల్సిందే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter