IPL 2024 Playoff Scenario: రోజురోజుకు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటి వరకు రెండో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానానికి పడిపోయింది. నిన్న ఆర్సీబీ విజయం సాధించిన కేకేఆర్ మళ్లీ తిరిగి సెకండ్ ఫ్లేస్ ను దక్కించుకుంది. ఎప్పటిలాగే రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆదివారం ముగిసిన మ్యాచులు ఆనంతరం ఫ్లే ఆఫ్ రేసు నుంచి రెండు జట్లు ఔటైనట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రెండు జట్లు ఔట్: 
ఏప్రిల్ 21న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చేతిలో ఓడిపోవడం ద్వారా ఆర్సీబీ ఫ్లే అవకాశాలు దాదాపు ముగిశాయి. పంజాబ్ కింగ్స్ కూడా ఈ రేసు నుంచి ఎలిమినేట్ అవ్వడం దాదాపు పిక్స్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచులు ఆడగా.. ఏడింటిలో ఓడిపోయింది. మరోవైపు పంజాబ్ ఎనిమిది మ్యాచుల్లో ఆరింటిలో ఓడిపోయింది. దీంతో ఈ రెండు జట్లు ఫ్లే ఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసినట్లైంది. 


ప్లేఆఫ్ రేసులో 8 జట్లు:
రాజస్థాన్, కోల్‌కతా, సన్ రైజర్స్, సీఎస్కే జట్లు మెుదటి నాలుగు స్థానాల్లో నిలిచి ఫ్లే ఆఫ్ రేసులో ముందుంజలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో లక్నో, గుజరాత్, ముంబై, ఢిల్లీ టీమ్స్ ఉన్నాయి. సంజూ సేన మరో రెండు మ్యాచులు, కేకేఆర్, ఎస్ఆర్ హెచ్ మరో మూడు మ్యాచుల్లో గెలిస్తే ఫ్లే ఆఫ్ కు చేరుకుంటాయి. చెన్నై, లక్నోలు మరో నాలుగు మ్యాచుల్లో ఈ రేసులో ఉంటాయి. 


Also Read: Virat Kohli No Ball Issue: విరాట్ కోహ్లీ అవుట్ నిర్ణయంపై నెటిజన్ల ఆగ్రహం, ముదురుతున్న నో బాల్ వివాదం


Also Read: RCB vs KKR Highlights: ఆర్సీబీ ఏడో ఓటమి.. ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook