KL Rahul: లక్నో సూపర్ జెయింట్స్ కొత్త సారధి కేఎల్ రాహుల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పంజాబ్ కింగ్స్ లెవెన్ టీమ్ రాహుల్‌ను ఎందుకు రీటైన్ చేసుకోలేదు. ఇదే అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. ఆ వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి ఐపీఎల్‌లో దాదాపు అన్ని జట్ల స్వరూపం మారింది. ఆటగాళ్ల జట్లు మారిపోయాయి. కెప్టెన్స్ మారారు. కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇస్తున్నాయి. బీసీసీఐ కొన్ని నిబంధనల్ని కూడా మార్చింది. ఈ నేపధ్యంలో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కొత్త సారధిగా పంజాబ్ కింగ్స్ లెవెన్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. 


వాస్తవానికి పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు కేఎల్ రాహుల్‌ను రిటైన్ చేసుకోలేదు. ఈ విషయంపై అప్పట్లో చర్చ రేగింది. కెప్టెన్ ఆటగాడిని రిటైన్ చేసుకోకపోవడమేంటనేది ఆసక్తిగా మారింది. అయితే తన సూచన మేరకే జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకోలేదని..స్వయంగా కేఎల్ రాహుల్ వెల్లడించాడు. తనను రిటైన్ చేసుకోవద్దని చెప్పడంతో పంజాబ్ కింగ్స్ లెవెన్ తనను విడుదల చేసింది. వెంటనే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సొంతం చేసుకుంది. 


నాలుగేళ్లపాటు ఆ జట్టుతో కలిసి ఉన్నానని..ఈ ప్రయాణంలో కొత్తగా ఏం నిరూపించుకోవాలో చూడాలని భావించినట్టు చెప్పాడు కేఎల్ రాహుల్. పంజాబ్ జట్టుతో సుదీర్ఘకాలంగా విడదీయలేని బంధముందని..కొత్తగా ఏదైనా చేయాలనే తపనతో..సవాళ్లు ఎదుర్కోవాలనే కోరికతో రిటైన్ చేసుకోవద్దని కోరినట్టు రాహుల్ స్పష్టం చేశాడు. పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు తరపున ఐపీఎల్ 2021లో 626 పరుగులు సాధించాడు.కెప్టెన్‌గా విఫలమైనా.బ్యాట్స్‌మెన్‌గా సఫలం కాలేదు. 


Also read: IPL 2022: ఆ ఆటగాడికి తొలిసారిగా ఐపీఎల్ ఆడే అవకాశం