Wimbledon 2021 Winner: వింబుల్డన్ 2021 విన్నర్ Novak Djokovic, అత్యధిక టైటిల్స్‌తో రికార్డు
Novak Djokovic Wimbledon 2021 Winner | నొవాక్ జకోవిచ్ తొలి సెట్ ఓడినా, వరుసగా మూడు సెట్లు నెగ్గి మరో గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 3 గంటల 24 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో విజయంతో కెరీర్‌లో ఆరో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
Novak Djokovic Wimbledon 2021 Winner | వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ 2021 విజేతగా సెర్బియా టెన్నిస్ స్టార్, ప్రపంచ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్ నిలిచాడు. రొలాండ్ గారోస్‌లో ఆదివారం రాత్రి జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ 6-7 (4/7), 6-4, 6-4, 6-3 తేడాతో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఇటలీ క్రీడాకారుడు మట్టెవో బెరెట్టినిపై విజయం సాధించాడు.
తొలి సెట్ ఓడినా, వరుసగా మూడు సెట్లు నెగ్గి మరో గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 3 గంటల 24 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో విజయంతో కెరీర్‌లో ఆరో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇది జకోవిచ్ కెరీర్‌లో ఓవరాల్‌గా 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం గమనార్హం. ఈ క్రమంలో పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెడరర్(20), స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్(20) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. సెర్బియా యోధుడు, వింబుల్డన్ విజేత జకోవిచ్(Novak Djokovic)కు రూ. 17 కోట్ల 61 లక్షలు (17 లక్షల పౌండ్లు), రన్నరప్‌గా నిలిచిన బెరెట్టినికి రూ. 9 కోట్ల 32 లక్షలు (9 లక్షల పౌండ్లు) ప్రైజ్‌మనీగా అందుకున్నారు.
ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సైతం 34 ఏళ్ల సెర్బియా ఆటగాడు జకోవిచ్ నెగ్గడం గమనార్హం. ఈ ఏడాది జరగనున్న యూఎస్ ఓపెన్‌లో సైతం గెలిస్తే 52 ఏళ్ల తరువాత క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ సాధించిన టెన్నిస్ ఆటగాడిగా జకోవిచ్ చరిత్ర సృష్టిస్తాడు. చివరగా 1969లో రాడ్ లెవర్ ఈ ఘనత సాధించాడు. జకోవిచ్ అత్యధికంగా 9 ఆస్ట్రేలియన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాడు. వింబుల్డన్ (Wimbledon 2021) 6, యూఎస్ ఓపెన్ 3, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ 2 పర్యాయాలు నెగ్గాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook