Wimbledon 2023 final Highlights: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి వొండ్రుసోవా విజేతగా నిలిచింది. టునీషియాకు చెందిన జాబెర్‌పై గెలుపొంది తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ ను ముద్దాడింది. ఫైనల్ లో ఆమె ఒన్స్‌ జాబెర్‌పై 6-4, 6-4 తేడాతో విజయం సాధించింది. వింబుల్డన్‌ హిస్టరీలో ఛాంపియన్ గా నిలిచిన తొలి అన్ సీడెడ్ ఫ్లేయర్ గా వొండ్రుసోవా రికార్డు సృష్టించింది. గతంలో రెండు సార్లు తుదిపోరులో ఓటమి చవిచూసినా జాబెర్..తాజా మ్యాచ్ లోనూ ఓటమిపాలైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెంటర్ కోర్ట్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన జాబెర్.. వొండ్రుసోవాకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. తొలి సెట్లో ఆరు పాయింట్లను సులభంగా సాధించిన వొండ్రుసోవా.. రెండో సెట్ లో కాస్త పోటీని ఎదుర్కోంది. అయినప్పటికీ పట్టువదలకుండా రెండో సెట్ ను నెగ్గింది. వొండ్రూసోవా చివరి 18 పాయింట్లలో 16 గెలిచింది. మ్యాచ్ ఓటమి అనంతరం జాబెర్ భావోద్వేగానికి గురైంది. ఖచ్చితంగా ఏదో రోజు టోర్నమెంట్ గెలుస్తానని వాగ్దానం చేసింది. 


Also Read: IND Vs WI Highlights: ఆ రన్ కోసం వెయిట్ చేశాం.. ఇన్నింగ్స్‌ డిక్లేర్‌పై రోహిత్ శర్మ క్లారిటీ


ఈ సంవత్సరం జనవరిలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన గ్రాండ్ స్లామ్ జర్నీని ఓటమితో ముగించిన సంగతి తెలిసిందే. గ్రాండ్ స్లామ్ కెరీర్ లో చివరిదైన ఆస్ట్రేలియా ఓపెన్ లో మహిళల డబుల్స్, మిక్సడ్ డబుల్స్ విభాగంలో పోటీపడింది సానియా. వుమెన్స్ డబుల్స్ లో నిరాశపరిచినప్పటికీ, మిక్సడ్ డబుల్స్ లో మాత్రం పైనల్ కు చేరింది. అయితే తన సహచర ఆటగాడు రోహన్ బోపన్నతో కలిసి పైనల్ ఆడిన సానియా తుదిపోరులో ఓటమిపాలైంది. సానియా మీర్జా తన కెరీర్ లో మెుత్తంగా 43 డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది.


Also Read:  WTC Points Table: డబ్ల్యూటీసీ రేసులో టాప్‌ ప్లేస్‌కు టీమిండియా.. ఒక్క గెలుపుతోనే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి