Wisden names India Mens T20 World Cup XI of all time, MS Dhoni Missed: విజ్డెన్ మ్యాగజైన్.. ఆల్‌టైమ్ భారత్ టీ20 జట్టును ఎంపిక చేసింది. ఆల్‌టైమ్ టీ20 జట్టులో భారత మాజీలతో పాటు యువకులకు కూడా చోటు దక్కింది. యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, అశిష్‌ నెహ్రా, వీరేందర్‌ సెహ్వాగ్‌ లాంటి ఆటగాళ్లకు చోటిచ్చిన విజ్డెన్.. విచిత్రంగా భారత్‌కు తొలి టీ20 ప్రపంచకప్‌ను అందించిన ఎంఎస్ ధోనీను మాత్రం పక్కన పెట్టింది. వికెట్ కీపర్‌గా దినేష్ కార్తీక్‌ను ఎంపిక చేసింది. ఇది మహీ అభిమానులను నిరాశకు గురిచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజ్డెన్‌ మ్యాగజైన్‌ మంగళవారం ఆల్‌టైమ్ భారత్ టీ20 జట్టును ప్రకటించింది. తాము ఎంచుకున్న ప్రమాణం ప్రకారం.. భారత జట్టును ఎంపిక చేయడం అంత సులభం కాదని పేర్కొంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ 2022 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన జట్టులో ఏకంగా ఏడుగురు ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం. ఇక 2007 ప్రపంచకప్‌ జట్టు నుంచి నలుగుర్ని ఆటగాళ్లను విజ్డెన్‌ తీసుకుంది. మాజీ ఆటగాళ్లు యువరాజ్‌ సింగ్‌, అశిష్‌ నెహ్రా, వీరేందర్‌ సెహ్వాగ్‌, సురేష్‌ రైనాకు ఆల్‌టైమ్ భారత్ టీ20 జట్టులో చోటు దక్కింది. 


ఆల్‌టైమ్ భారత్ టీ20 జట్టులో టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎంఎస్ ధోనీకి బదులుగా దినేష్‌ కార్తీక్‌ను జట్టులోకి తీసుకోవడంపై విజ్డెన్‌ కారణాలను చెప్పినా.. మహీ ఫాన్స్ మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.



ఆల్‌టైమ్ భారత్ టీ20 జట్టు:
రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా, సురేష్‌ రైనా, దినేష్‌ కార్తీక్‌ (కీపర్), ఆర్ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్ బుమ్రా, అశిష్‌ నెహ్రా, వీరేందర్‌ సెహ్వాగ్‌. 


Also Read: Pranita Subhash : అదరగొట్టేసిన హీరోయిన్ ప్రణీత


Also Read: రియాలిటీకి దూరంగా ప్రచారం.. దారుణంగా కలెక్షన్లు.. హిట్ కొట్టాలంటే అంత రావలసిందే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U  


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook