మహిళల క్రికెట్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. సోమవారం ఈ షెడ్యూలుని ఐసీసీ అధికారికంగా విడుదల చేసింది. ఈ టోర్నమెంటు ఈ సంవత్సరం నవంబరులో వెస్టిండీస్ వేదికగా జరగనుంది. ఈ టోర్నమెంటులో డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్‌తో పాటు.. మూడు సార్లు వరల్డ్ కప్ దక్కించుకున్న ఆస్ట్రేలియాతో సహా ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు చోటు దక్కించుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటితో పాటు అదనంగా చోటు దక్కించుకోవడం కోసం బంగ్లాదేశ్, ఐర్లాండ్, ది నెదర్లాండ్స్, పపువా న్యూ గినియా, స్కాట్‌ల్యాండ్, థాయ్‌ల్యాండ్, ఉగాండ, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు క్వాలిఫైయింగ్ మ్యాచ్స్‌లో పోటీ పడనున్నాయి. నవంబర్ 9వ తేదిన ప్రారంభవ్వనున్న ఈ టోర్నమెంటులో ఇండియా తన తొలి మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడనుంది.


ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో భారత్‌కు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. హీతర్ నైట్ (ఇంగ్లండ్), మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్), సుజీ బేట్స్ (న్యూజిలాండ్స్), బిస్మా మరూఫ్ (పాకిస్తాన్), డేన్ వాన్ నేకెర్క్ (దక్షిణాఫ్రికా), చమారి ఆటపట్టు (శ్రీలంక) మొదలైన వారు తమ తమ జట్లకు సారథ్యం వహించనున్నారు.