Heather Knight Takes One Handed Catch to dismiss Lea Tahuhu in ENGW vs NZW: పురుష క్రికెట్‌లో బెస్ట్ ఫీల్డర్‌లు ఎందరో ఉన్నా.. మహిళల క్రికెట్‌లో మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. గత కొంతకాలంగా వుమెన్స్ క్రికెటర్లు కూడా ఫీల్డింగ్‌లో మెరుస్తున్నారు. తాము కూడా ఏమీ తక్కువ కాదంటూ గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచులు పడుతున్నారు. ఇప్పటికే ఇండియ‌న్ బ్యాటర్లు స్మృతి మంధాన, జెమినా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ తమ అద్భుత ఫీల్డింగ్‌తో అందరిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. తాజాగా ఇంగ్లండ్ మహిళా కెప్టెన్ హీథర్ నైట్ కూడా సూపర్ క్యాచ్ పట్టారు. ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2022లో భాగంగా ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో ఈరోజు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో ముందుగా కివీస్ బ్యాటింగ్ చేసింది. టాప్ ఆర్డర్ పర్వాలేదనిపించినా.. మిడిల్ ముంచేసింది. కేటీ మార్టిన్ ఐదవ వికెట్ రూపంలో పెవిలియన్ చేరగా.. లీ తహుహు క్రీజులోకి వచ్చింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన తహుహు ఇంకా కుదురుకోలేదు. ఇంగ్లీష్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ వేసిన 38వ ఓవర్ రెండో బంతిని తహుహు ఆఫ్ సైడ్ దిశగా భారీ షాట్ ఆడింది. సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న హీథర్ నైట్ కుడివైపుకు దూకుతూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది. 


బంతి తనకు కాస్త దూరంగా వెళుతున్నా.. హీథర్ నైట్ పక్కకు డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది. క్యాచ్ అందుకున్నాక కిందపడిన ఇంగ్లీష్ కెప్టెన్ బంతిని మాత్రం వదలలేదు. దాంతో లీ తహుహు నిరాశగా పెవిలియన్ చేరింది. అద్భుత క్యాచ్ పట్టిన నైట్‌ను సహచరులు ప్రశంసలతో ముంచెత్తారు. ఇందుకు సంబందించిన వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'వావ్.. వాట్ ఏ క్యాచ్', 'సూపర్ వుమెన్', 'స్టన్నింగ్‌ క్యాచ్‌' అంటూ వీడియో చూసిన వారు పోస్టులు పెడుతున్నారు.



న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచులో ఇంగ్లండ్ ఒక వికెట్‌ తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆల్‌రౌండర్‌ స్కివర్ 61 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. హీథర్ నైట్ (42), సోఫియా డంక్లీ (33) పర్వాలేదనిపించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 203 పరుగులకు ఆలౌటైంది. డివైన్‌ (41), మాడీ గ్రీన్‌ (52) రాణించారు.


Also Read: IPL 2022: సీఎస్‌కేకు మరో షాక్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం!!


Also Read: రాజమౌళికి సానుభూతి ఉండదు.. ఆరోగ్యం బాగాలేకపోయినా నాతో షూటింగ్ చేపించారు! స్టార్ హీరో ఫిర్యాదు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook