World Athletics Championships 2022: అమెరికాలోని ఒరేగాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2022లో భారత జావెలిన్ త్రో స్టార్ 'నీరజ్ చోప్రా' సత్తా చాటాడు. జావెలిన్ త్రో విభాగంలో జరిగిన ఫైనల్‌లో రజత పథకం సాధించాడు. నాలుగో ప్రయత్నంలో చోప్రా 88.13 మీ. దూరం మేర బల్లెం విసరడం ద్వారా సిల్వర్ మెడల్‌తో రెండో స్థానంలో నిలిచాడు. అంజు బాబీ జార్జ్ తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ సాధించిన రెండో అథ్లెట్‌గా నీరజ్ చోప్రా నిలిచాడు. 2003లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరుపున అంజు బాబీ జార్జ్ లాంగ్ జంప్ విభాగంలో కాంస్య పథకం సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీరచ్ చోప్రా ఫస్ట్ అటెంప్ట్ ఫౌల్ అయింది. రెండో అటెంప్‌లో 82.39 మీ. మేర బల్లెం విసిరాడు. మూడో అటెంప్ట్‌లో మరింత మెరుగ్గా 86.37 మీ. మేర బల్లెం విసిరాడు. నాలుగో అటెంప్ట్‌లో 88.13 మీటర్ల త్రో విసిరి బెస్ట్ త్రో నమోదు చేశాడు. ఆ తర్వాతి రెండు అటెంప్ట్స్ ఫౌల్ అయ్యాయి. నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలవడంతో హర్యానాలోని అతని స్వగ్రామం పానీపట్‌లో సంబరాలు జరుపుకుంటున్నారు.


తాజా ఫైనల్లో గ్రెనడాకి చెందిన అండర్సన్ పీటర్ 90.54 మీర బల్లెం విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు. మొదటి ప్రయత్నంలో 90.21 మీ, రెండో ప్రయత్నంలో 90.46 మీ. మేర బల్లెం విసిరిన అండర్సన్ పీటర్.. ఆరో ప్రయత్నంలో బెస్ట్ త్రో నమోదు చేశాడు. సీజెక్ రిపబ్లిక్‌కి చెందిన జాకూబ్ 88.09 మీ. ఫీట్‌తో కాంస్య పతకం సాధించాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 86.86 మీ. త్రో విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు.



Also Read: Horoscope Today July 24th : నేటి రాశి ఫలాలు.. ఈ 8 రాశుల వారికి శుభ దినం.. మంచి ఫలితాలు పొందుతారు..  


Also Read: Bonalu Festival: నేడు లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు... నేటితో బోనాల పండగ ముగింపు.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.