టీమిండియా ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. విండీస్ పై 125 పరుగుల తేడాతో కోహ్లీసేన విజయం సాధించింది. టీమిండియా ఉంచిన 269 పరుగుల  లక్ష్యాన్ని చేధించలేక విండీస్ చేతులెత్తేసింది. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 34.2 ఓవర్లు మాత్రమే ఎదుర్కొని 143 పరుగులకే కరేబియన్ జట్టు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ జట్టుకు మరో అద్భుత గెలుపు సాధ్యపడింది. టీమిండియా ఫేసర్ షమీ మూడు వికెట్లు దక్కించుకోగా..బుమ్రా, చాహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్థసెంచరీలతో రాణించిన కోహ్లీ, ధోనీ
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 268 పరుగులు చేసింది. కోహ్లీ (72), ధోనీ (56) అర్థ సెంచరీతో కదం తొక్కారు. ఓపెనర్ లోకేష్ రాహుల్ 48 పరుగులు, హాట్ హిట్టర్ హార్థిక్ ప్యాండ్యా 46 పరుగులు తమ వంతు సహకారం అందించారు. ఫలితంగా నిర్థీత 50 ఓవర్లలో భారత్ 268 పరుగులు చేయగల్గింది.


భారత్ సెమీస్ కు చేరినట్లేనా ?
విండీస్ పై విజయంతో టీమిండియా దాదాపు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొంది.  అయితే మిగిలిన జట్ల పెర్ఫార్మెన్స్ బట్టి సెమీస్ అవాకాశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి భారత్ సెమీస్ లో అఫిషియల్ గా ప్రవేశించాలంటే  తదుపరి మూడు మ్యాచుల్లో ఏ ఒక్కటి గెలిచినా నేరుగా సెమీస్ చేరుకుటుంది. ఇప్పటికీ వరకు మాత్రం భారత్ సేవ్ జోన్ లో ఉందనే చెప్పవచ్చు. కాగా ఇప్పటికే పాయింట్ల పట్టికలో 12 పాయింట్ల సాధించి అగ్రస్థానంలో నిలిచిన ఆసీస్ మాత్రమే సెమీస్ బెర్త్ ఖాయం చేసుంది. మిగిలిన జట్లు సెమీస్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి.