Cricket Sentiments: ప్రపంచకప్ ఫైనల్ చుట్టూ సెంటిమెంట్లు, మ్యాచ్ చూడవద్దంటూ అమితాబ్‌కు విజ్ఞప్తులు
Cricket Sentiments: ఇండియా ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు చేరిందనే ఆనందం దేశమంతటా కన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగే పోరులో విజయం సిద్ధించాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. ఫైనల్ పోరు వీక్షించే ఏర్పాట్లు ఇప్పట్నించే చేసుకుంటున్నారు.
Cricket Sentiments: ఐసీసీ ప్రపంచకప్ 2023 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా పోరుకు అంతా సిద్ధమౌతోంది. 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరులో తలపడనున్న ఇండియా ప్రతీకారం కోసం చూస్తోంది. 2003 నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుని మూడోసారి కప్ సాధించాలని భావిస్తోంది.
ప్రపంచకప్ 2023 ఫైనల్ పోరు సమీపించేకొద్దీ టీమ్ ఇండియా కోసం వివిధ ఆలయాల్లో పూజలు, మసీదుల్లో నమాజులు, చర్చిల్లో ప్రార్ధనలు జరుగుతున్నాయి. ఇంకొందరైతే ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి, అందరితో కలిసి చూస్తే ఎంజాయ్ చేయడం ఇలా అన్ని రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇంకొందరైతే సెంటిమెంట్లు ఏమైనా ఉన్నాయోమోనని పరిశీలించుకుంటున్నారు. అంటే టీమ్ ఇండియా నెగ్గాలంటే ఎలాంటి సెంటిమెంట్లు గతంలో ఎవరికి ఏం వర్కవుట్ అయిందనేది చెక్ చేస్తున్నారు. ఉదాహరణకు కొందరు మ్యాచ్ చూస్తే ఇండియాకు కలిసి రాకపోవడం, కొందరు చూడకపోతే కలిసి రావడం, కొందరికి కచ్చితంగా చూస్తేనే ప్రయోజనం కలగడం వంటివి ఉంటాయి. ఇంకొందరికి ఫలానా చోట, ఫలానా దిశలో కూర్చుని చూస్తే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని అనుకుంటారు. ఇలాంటివి ఎక్కడైనా ఉంటే వాటిని ఈసారి ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడీ సెంటిమెంట్ సెగ బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు సైతం పట్టుకుంది. అమితాబ్ బచ్చన్‌ను మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ స్డేడియంకు రావద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దయచేసి మ్యాచ్ చూడ్డానికి రావద్దని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకని అనుకుంటున్నారా..కారణం లేకపోలేదు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఇండియా 70 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం అమితాబ్ స్వయంగా పోస్ట్ చేశారు. నేను మ్యాచ్ చూడకపోతే మనం గెలిచాం అని ట్విట్టర్‌లో బిగ్‌బి పోస్ట్ చేశారు. దీంతో సెంటిమెంట్లు ఫాలో అయ్యే క్రికెట్ ప్రేమికులకు గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు అమితాబ్ ఫైనల్ మ్యాచ్ చూస్తే ఇండియా ఎక్కడ ఓడిపోతుందోననే ఆందోళన రేగుతోంది.
దయచేసి మ్యాచ్‌కు రావద్దంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనికి స్పందించిన అమితాబ్ బచ్చన్ మ్యాచ్‌కు వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నానంటూ మరో పోస్ట్ చేశారు. మరి బిగ్‌బి నెటిజన్ల సెంటిమెంట్ గౌరవిస్తారా లేదా అనేది వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook