World Cup 2023 Final Show: ప్రపంచకప్ 2023 తుది సమరంలో ఇండియా ఆస్ట్రేలియాలు తాడోపేడో తేల్చుకోనునన్నాయి. దాదాపు 20 ఏళ్ల తరువాత ఈ రెండు జట్లు తిరిగి తలపడనున్నాయి. చివరిసారిగా ఈ రెండు జట్లు 2003లో తలపడ్డాయి.
ఈసారి ప్రపంచకప్ ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరపనున్నారు. భారత వైమానిక దళానికి చెందిన యుద్ద విమానాలతో విన్యాసాలు నిర్వహించనున్నారు. ఫైనల్ మ్యాచ్‌కు 10 నిమిషాల ముందు భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ బృందం ఈ విన్యాసాలు చేయనుంది. ఇప్పటికే దీనిక సంబంధించి విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాల్లో మొత్తం 9 ఎయిర క్రాఫ్ట్‌లు పాల్గొననున్నాయి. ఏరోబాటిక్ టీమ్ చేసిన రిహార్సల్స్ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ సమరాన్ని వీక్షించేందుకు ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రదాని రిచర్డ్ మార్లెస్, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. వీరితోపాటు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
Also read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook