World Cup 2023 Schedule Released: వరల్డ్ ఫైనల్.. సెమీ ఫైనల్స్ వేదికలు ఫిక్స్..! ఎక్కడంటే..?
ICC ODI World Cup 2023 Final Match Venue Fixed: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను నేడు విడుదల చేసే అవకాశం ఉంది. భారత్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీకి ఇప్పటికే 12 వేదికలను ఖరారు చేశారు. ఫైనల్, సెమీ ఫైనల్స్ జరిగే మ్యాచ్‌లకు కూడా వేదికలు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ICC ODI World Cup 2023 Final Match Venue Fixed: ఈ ఏడాది భారత గడ్డపై జరిగే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో ప్రకటించాల్సిన షెడ్యూల్‌ను ఐసీసీ వాయిదా వేస్తూ వస్తోంది. ప్రపంచకప్ ఆడే అన్ని దేశాల నుంచి క్లారిటీ తీసుకున్న ఐసీసీ.. నేడు ముంబైలో అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్‌లు ఎక్కడ జరగనున్నాయి..? ఇండియా-పాక్ మ్యాచ్ ఎప్పుడు..? ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభించనున్నాయి. 2011 తర్వాత టీమిండియా వన్డే క్రికెట్ ప్రపంచకప్‌ను హోస్ట్ చేయనుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఫైనల్, సెమీ ఫైనల్ వేదికలు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. భారత్‌లోన మొత్తం 12 స్టేడియాల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతుండగా.. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నట్లు తెలిసింది. దీంతో పాటు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్, ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెమీఫైనల్ మ్యాచ్‌లకు వేదికలు ఖరారు చేసినట్లు సమాచారం.
వరల్డ్ కప్ కోసం అహ్మదాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, ధర్మశాల, లక్నో, పూణె, త్రివేండ్రం, గౌహతిలను వేదికలుగా నిర్ణయించారు. 2011లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌కు ముంబై వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వగా.. ఈసారి నరేంద్ర మోదీ స్టేడియం ఇవ్వనుంది. టీమిండియా సెమీ ఫైనల్ చేరితే.. పాయింట్ల పట్టిక, గ్రూప్‌లో స్థానంతో సంబంధం లేకుండా వాంఖడేలో ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో సెమీస్‌ను ఈడెన్ గార్డెన్‌లో నిర్వహించేందుకు రెడీ అవుతోంది.
సోమవారం ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ అధికారులతో బీసీసీఐ అధికారులు అనధికారికంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఐసీసీ నిబంధనలతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే ఫైనల్ మ్యాచ్ వేదికను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు నేరుగా క్వాలిఫై అవ్వగా.. మరో రెండు జట్లు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లలో గెలిచి వరల్డ్ కప్‌కు ఎంట్రీ ఇవ్వనున్నాయి.
రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. లీగ్ దశలో రెండు గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. నాలుగు జట్ల మధ్య రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తాయి. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19వ తేదీన జరిగే ఛాన్స్ ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook