South Africa Records: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియంలో ఇవాళ జరిగిన శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా ప్రపంచకప్ మ్యాచ్‌లో రికార్డులు హోరెత్తాయి. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు సాధించి సరికొత్త రికార్డు నమోదు చేశారు. వన్డే ప్రపంచకప్‌లో అత్యదిక స్కోరు కూడా సాధించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచకప్ 2023లో కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. శ్రీలంకతో ఇవాళ జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడినా తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ను 10 పరుగులకే కోల్పోయినా ఆ తరువాత ఇక వెనుదిరిగి చూడలేదు. పరుగులతో ఊచకోత ఎలా చేయాలో అందరికీ రుచి చూపించారు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 5 వికెట్లు కోల్పోయి 428 పరుగుల భారీ స్కోర్ సాధించారు. ఇది వన్డే ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు. గతంలో 2015లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై ఆస్ట్రేలియా 417 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆ రికార్డ్ ఇప్పుడు బ్రేక్ అయింది. 


ఇక రెండవ రికార్డు ఒకే ఇన్నింగ్స్‌లో వరుసగా ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేయడం. ఇవాళ్టి మ్యాచ్‌లో  క్వింటన్ డీకాక్ 84 బంతుల్లో  12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు చేయగా, ఆ తరువాత రాస్సీ వాన్‌డెర్ డుసెన్ 110 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 పరుగులు సాదించాడు. ఇక చివర్లో మూడవ సెంచరీ వీరుడు ఎయిడెన్ మార్క్రమ్ వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. కేవలం 49 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో  106 పరుగులు చేశాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఒకే జట్టు నుంచి ముగ్గురు సెంచరీలు సాధించడం ఇదే ఇప్పటివరకూ ఉన్న రికార్డు. 


ఇక ఇవాళ్టి మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా సాధించిన మరో రికార్డు వన్జే ప్రపంచకప్‌లో 400 పరుగులను మూడోసారి దాటడం. గతంలో 2015 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఐర్లండ్‌పై 411 పరుగులు చేయగా, వెస్ట్ ఇండీస్‌పై 408 పరుగులు చేసింది. ఇవాళ ఏకంగా 428 పరుగులు సాధించింది. అంటే ప్రపంచకప్ వన్డేల్లో మూడుసార్లు 400 స్కోరు దాటిన తొలి జట్టు ఇదే.


Also read: World Cup 2023: భారీ స్కోరుతో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు, వన్డే ప్రపంచకప్‌లో టాపా్ 10 అత్యదిక స్కోర్లు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook