Praggnanandhaa beats World Champion Magnus Carlsen: వరల్డ్ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద రమేశ్‌బాబు (Praggnanandhaa Rameshbabu) మరోసారి షాకిచ్చాడు. చెస్సబుల్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్లో ఈ చెన్నై టీనేజర్.. చెస్‌ దిగ్గజం కార్ల్‌సన్‌ను (Magnus Carlsen) ఓడించాడు.  శనివారం వీరిద్దరి మధ్య జరుగుతున్న ఐదో రౌండ్ గేమ్ డ్రా దిశగా సాగుతున్న క్రమంలో 40వ ఎత్తు చివరి క్షణాల్లో కార్ల్‌సన్‌ చిన్న తప్పిదం చేశాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజ్ఞానంద తన ఎత్తుగడతో కార్ల్‌సన్‌ను చిత్తు చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం కార్లసన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. నార్వే దిగ్గజంపై గెలుపుతో ప్రజ్ఞానంద 12 పాయింట్లును తన ఖాతాలో వేసుకుని ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ విజయంతో మనోడు నాకౌట్ రేసులో నిలిచాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో తొలిసారి కార్ల్‌సన్‌పై గెలుపొందాడు ప్రజ్ఞానంద. తద్వారా నార్వేజియన్ సూపర్‌స్టార్‌పై విజయం సాధించిన మూడవ భారతీయుడిగా నిలిచాడు. ఆరో రౌండ్‌లో హరికృష్ణతో గేమ్‌ను డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద..అనంతరం జోన్స్‌పై నెగ్గి, 8వ రౌండ్‌లో డేవిడ్‌ ఆంటోన్ చేతిలో ఓడాడు. ప్రగ్నానంద ప్రస్తుతం డింగ్ లిరెన్‌తో కలిసి ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 


Also Read: Facts About PV Sindhu: ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు గురించి మీకు ఈ విషయాలు తెలుసా? 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook