ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ర్యాంకింగ్‌లో టీమ్ ఇండియా రెండవ స్థానాన్ని ఆక్రమించింది. అసలీ పాయింట్ల పద్ధతి, ర్యాంకింగ్ ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(World Test Champion Ship) నిర్ణయించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ(ICC) కొత్త పద్ధతిని ఇప్పటికే ప్రకటించింది. ఈ కొత్త పద్ధతి ప్రకారమే వివిధ జట్లు గెలుపోటముల ఆధారంగా పాయింట్స్, ర్యాంకింగ్స్ నిర్ణయిస్తారు. ఇది ఎప్పటికప్పుడు మారుతుంటుంది. పర్సంటేజ్ ఆఫ్ పాయింట్ల ప్రకారం జట్లకు ర్యాంకులు ఇస్తారు. గెలిచిన ప్రతి మ్యాచ్‌కు 12 పాయింట్లు వస్తాయి. ఈ కొత్త పద్ధతి ప్రకారం గెలిచిన ప్రతి మ్యాచ్‌కు 12 పాయింట్లు, పర్సంటేజ్ రూపంలో వంద పాయింట్లు (WTC Rankings and Points)ఇస్తారు. ఒకవేళ మ్యాచ్ టై అయితే 6 పాయింట్లు, డ్రా అయితే 4 పాయింట్లు ఇస్తారు. పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే టై అయితే 50 శాతం, డ్రా అయితే 33.33 శాతం ఉంటుంది. ఇక ఓడిన మ్యాచ్‌కు 0 పాయింట్లు, 0 శాతం ఉంటుంది. మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా కూడా సిరీస్ పాయింట్లు కేటాయించనున్నారు. 


WTC 2021-23 Points Tableలో టీమ్ ఇండియా(Team India)రెండవ స్థానానికి చేరుకోగా, న్యూజిలాండ్ ఐదవ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగియడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ రెండవ ఎడిషన్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానం దక్కింది. అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా..పాయింట్ల పట్టికలో 30 పాయింట్లు, 50 శాతంతో రెండవ స్థానంలో ఉంది. ఇటు న్యూజిలాండ్ జట్టు(NewZealand) 4 పాయింట్లు, 33.33 శాతంతో 5వ స్థానంలో ఉంది. శ్రీలంక మాత్రం 100 పర్సంటేజ్ సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. 


Also read: ఐపీఎల్ 2022 రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా నేడే, జాబితాలో ఉండే ఆటగాళ్లు వీరే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook