GG Vs MI Highlights: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్యూపీఎల్) ఘనంగా ఆరంభమైంది. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 143 పరుగుల భారీ తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగగా.. కేవలం 64 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ జెయింట్స్‌ బ్యాట్స్‌వుమెన్స్ నలుగురు డకౌట్ అవ్వగా.. 9 మంది రెండేంకెల స్కోరును కూడా దాటలేకపోయారు. గుజరాత్ జెయింట్స్ తరఫున దయాళన్ హేమలత అత్యధికంగా 23 బంతుల్లో 29 రన్స్ చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్ సైకా ఇసాక్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టింది. నాట్ సేవర్ బ్రంట్, అమేలియా కెర్ తలో రెండు వికెట్ల తీశారు. ఇస్సీ వాంగ్ ఒక వికెట్ తీసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకుముందు గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బెత్ మూనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 30 బంతుల్లో 65 పరుగులు చేసింది. ఇందులో ఏకంగా 14 ఫోర్లు బాదడం విశేషం. ఓపెనర్ హేలీ మాథ్యూ 31 బంతుల్లో 47 పరుగులతో రాణించింది. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదింది. 


అమేలియా కెర్ 24 బంతుల్లో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. చివర్లో ఆమె దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 రన్స్ భారీ స్కోరు చేసింది. గుజరాత్ జెయింట్స్ తరఫున స్నేహ రానా రెండు వికెట్లు, యాష్లే గార్డనర్, తనూజా కన్వర్, జార్జియా వేర్‌హామ్‌లు తలో వికెట్ పడగొట్టారు. 


ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ బెత్ మూనీ గాయం కారణంగా రిటైర్డ్ ఔట్ అవ్వడంతో ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో మూడు బంతులు ఎదుర్కొన్న మూనీ.. క్రీజ్‌లో చీలమండ గాయంతో ఇబ్బంది పడింది. ఫిజియోను ఫీల్డ్‌లోకి వచ్చి చికిత్స చేసినా ఆమె సౌఖ్యంగా కదల్లేకపోయింది. దీంతో రిటైర్డ్ ఔట్‌గా కెప్టెన్ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్ గాయపడడం గుజరాత్ జట్టుకు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. 


Also Read: IMA On Antibiotics: భారీగా పెరుగుతున్న దగ్గు, జ్వరం కేసులు.. ఈ మందులు అస్సలు వాడకండి


Also Read: Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook