WPL 2024, Shreyanka Patil: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా.. ఐదో మ్యాచ్ మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. స్మృతి మంధాన నేతృత్వంలోని బెంగళూరు జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్‌పై గెలుపొందింది. ఆర్సీబీ తన తొలి మ్యాచ్ లో యూపీ వారియన్స్ ను ఓడించిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ్యాచ్ మధ్యలో మ్యారేజ్ ప్రపోజల్
నిన్న గుజరాత్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బెంగళూరు క్రికెటర్‌ శ్రేయాంక పాటిల్‌ (Shreyanka Patil)కి ఓ అభిమాని మ్యారేజ్‌ ప్రపోజల్‌ పెట్టాడు. విజిటర్‌ గ్యాలరీలో కూర్చున్న ఒక వ్కక్తి '‘విల్‌ యూ మేరీ మీ శ్రేయాంక పాటిల్‌'’ అని రాసిన ఫ్లకార్డును ప్రదర్శించాడు. అతడు టీవీ స్క్రీన్‌పై కనిపించగానే డగౌట్‌లో కూర్చున్న ఆర్సీబీ ఆటగాళ్లు నవ్వుకున్నారు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే శ్రేయాంక మాత్రం దీనిపై స్పందించలేదు. గత రెండు మ్యాచుల్లో శ్రేయాంక చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. 


ఆర్సీబీ విజయం
మంగళవారం జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది గుజరాత్. ఆ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆర్సీబీ 12.3 ఓవర్లలో రెండు వికెట్ల కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ తరఫున కెప్టెన్ స్మృతి మంధాన 43 పరుగులతో సత్తా చాటింది. సబ్బినేని మేఘన (35*), ఎల్సీ పెర్రీ (23*) కూడా రాణించారు.


Also Read: IND vs ENG: లండ‌న్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్.. ఐదో టెస్టులో ఆడేది అనుమానమే!


Also Read: BCCI Central Contracts: శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషాన్‌లకు భారీ షాక్.. బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు.. ఆ నలుగురికి A+ గ్రేడ్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి