IND vs ENG 05th Test Updates: స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 3-1 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ లో చివరి మ్యాచ్ టెస్టు ధర్మశాల వేదికగా మార్చి 07 నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ సమయంలో రాహుల్ తొడ కండరాలు పట్టేశాయి. గాయం కారణంగా గత మూడు టెస్టులకు దూరమైన రాహుల్ చివరి మ్యాచ్ కైనా అందుబాటులో ఉంటాడని టీమ్ మేనెజ్మెంట్ భావించింది. అయితే రాహుల్ పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని చికిత్స కోసం బీసీసీఐ లండన్ కు పంపిస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి రాహుల్ మూడో టెస్టులోనే ఆడాల్సి ఉంది, అయితే అతడికి క్లియరెన్స్ దక్కినా…చివరి నిమిషంలో తప్పించారు. ఇప్పటికే సిరీస్ గెలిచాం కాబట్టి ఆటగాళ్ల గాయాల విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. వచ్చే నెలలో ఐపీఎల్, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పటికే టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ లండన్ లో సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రధాని మోదీ కూడా షమీ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఇప్పడు రాహుల్ కూడా లండన్ వెళ్లనున్నాడు. అతడు కూడా గాయం నుంచి తర్వగా కోలుకుని మిగతా టోర్నీలకు అందుబాటులో ఉండాలని జట్టు మేనెజ్మెంట్ భావిస్తోంది.
బూమ్ బూమ్ బుమ్రా వచ్చేస్తున్నాడు..
రాంచీ టెస్టుకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా విశ్రాంతి తీసుకున్న బుమ్రా చివరి మ్యాచ్ కు తిరిగి రానున్నాడు. ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశమున్న నేపథ్యంలో బుమ్రాను ఐదోటెస్టులో ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది. మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లుగా ఆకాశ్ దీప్, సిరాజ్ ఉండనే ఉన్నారు. ఈసారి ఇద్దరి స్పిన్నర్లకే అవకాశం లభించనుంది. అశ్విన్, జడేజాకే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
Also Read: Mohammed Shami: మహ్మద్ షమీ సర్జరీ సక్సెస్.. ప్రధాని మోదీ ట్వీట్ వైరల్..
Also Read: Ind vs Eng: కోహ్లీ, షమీ, రాహుల్ స్టార్ ఆటగాళ్లు లేకుండానే టెస్ట్ సిరీస్ నెగ్గిన టీమ్ ఇండియా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook