WPL 2024 Prize Money List: ఐపీఎల్‌లో ఆర్‌సీబీ పురుషుల జట్టు సాధించలేనది.. డబ్ల్యూపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు ట్రోఫీ సాధించి కల నెరవేర్చింది. తొలి టైటిల్ కోసం 2008 నుంచి ఎదురుచూస్తున్న ఆర్‌సీబీ కలను అమ్మాయిలు నెరవేర్చారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో 8 వికెట్ల తేడాతో స్మృతి మంధాన సేన విజయం సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. 113 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్యాన్ని ఆర్సీబీ 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డబ్ల్యూటీఎల్‌ ట్రోఫీని గెలుచుకున్న ఆర్‌సీబీ మహిళల జట్టు 6 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని కైవసం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ టీమ్ రూ.3 కోట్లు గెలుచుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: RCB Vs DC Highlights: జయహో ఆర్‌సీబీ.. డబ్ల్యూపీఎల్ టైటిల్ విన్నర్‌గా స్మృతి మంధాన సేన.. ఫైనల్లో ఢిల్లీ డీలా


ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సోఫీ మోలినెక్స్ అందుకుంది. నాలుగు ఓవర్లలో 20 పరుగులకు 3 వికెట్లు పడగొట్టింది. షెఫాలీ వర్మ అత్యధిక సిక్సర్‌ల అవార్డును అందుకుంది. ఈ ఢిల్లీ ఓపెననర్ టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు 20 కొట్టింది. ఇందుకుగాను రూ.5 లక్షల నగదు బహుమతిని అందుకుంది. ఆరెంజ్ క్యాప్ ఎల్లీస్ పెర్రీకి దక్కింది. ఆమె 9 ఇన్నింగ్స్‌లలో 347 పరుగులు చేసింది. పర్పుల్ క్యాప్‌ను 8 ఇన్నింగ్స్‌లో 13 వికెట్లతో శ్రేయంక పాటిల్ గెలుచుకుంది. పెర్రీ, పాటిల్ ఇద్దరూ చెరో రూ.5 లక్షల నగదు ప్రైజ్ గెలుచుకున్నారు. పాటిల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌గా కూడా ఎంపికైంది.  ఇందుకు కోసం అదనంగా మరో రూ.5 లక్షల ప్రైజ్ అందుకుంది. 


దీప్తి శర్మ 295 పరుగులు, 10 వికెట్లతో ఈ సీజన్‌లో అత్యంత విలువైన క్రీడాకారిణిగా నిలిచింది. ఆమెకు రూ.5 లక్షల నగదు బహుమతి లభించింది. క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు సజీవన్ సజనకు దక్కింది. ఫెయిర్‌ప్లే అవార్డును కూడా ఆర్‌సీబీ జట్టు గెలుచుకుంది.


కప్ గెలుచుకున్న అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన హర్షం వ్యక్తం చేసింది. ఆమె కన్నడలో మాట్లాడింది. 'ఈ సలా కప్ నమ్దు' సంతోషంగా చెప్పింది. "కప్ గెలిచిన ఫీలింగ్ ఇంకా పోలేదు. సంతోషాన్ని ఎలా బయటకు చెప్పాలో అర్థం కావడం లేదు. మా బెంగుళూరు అడుగు నిజంగా బాగుంది. మేము ఢిల్లీకి వచ్చిన తరువాత రెండు కష్టమైన మ్యాచ్‌లు ఎదుర్కొన్నాం. అప్పుడే సరైన మార్గంలో అడుగులు వేయాలని అనుకున్నాం. గత సంవత్సరం మాకు చాలా విషయాలు నేర్పింది. ఏం చేయాలి..? ఏ తప్పులు చేయకూడదు..? అని మేనేజ్‌మెంట్ చెప్పింది. ఎప్పుడూ వచ్చే ఒక ప్రకటన ఈ సాలా కప్ నామ్దే. ఇప్పుడు అది ఈ సాలా కప్ నమ్దు. కన్నడ నా మొదటి భాష కాదు కానీ అభిమానుల కోసం చెప్పడం ముఖ్యం." అని ఆర్‌సీబీ కెప్టెన్ చెప్పుకొచ్చింది.


Also Read: YCP Bus Yatra: మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ భారీ బస్సు యాత్ర, రోజుకో సభ



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter