YCP Bus Yatra: ఏపీలో వైనాట్ 175 లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలు తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా దిగుతున్నాయి. ఇక వామపక్షాలతో జతకట్టి కాంగ్రెస్ కూడా పోటీలో నిలబడుతోంది. మొత్తం అభ్యర్ధుల్ని ప్రకటించేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర తలపెట్టింది. ఈ యాత్ర ఎలా సాగుతుందనే వివరాలు తెలుసుకుందాం.
2019 ఎన్నికల్లో విజయ శంఖారావం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సక్సెస్ అయిన వైఎస్ జగన్ ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఈ నెల 26 లేదా 27వ తేదీన ఇడుపుల పాయ నుంచి ఇఛ్చాపురం వరకూ బస్సు యాత్ర జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులు ఈ యాత్ర కొనసాగనుంది. రోజుకో జిల్లాలో బస్సు యాత్ర ఉండేలా రూట్ మ్యాప్ ప్లాన్ చేస్తున్నారు. ఉదయం ప్రజలతో ఇంట్రాక్షన్ ఉంటుంది. మద్యాహ్నం లేదా సాయంత్రం సమయాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తొలి విడతలో 21-24 రోజుల్లో బస్సు యాత్ర ముగించి ఆ తరువాత ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలు, ర్యాలీలు ప్లాన్ చేయనున్నారు.
ప్రతి పార్లమెంట్ స్థానంలోని ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసేలా రూట్ మ్యాప్ ఉంటుంది. ఇప్పటికే పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో బేటీ అయిన వైఎస్ జగన్ ఏయే తేదీల్లో ఎక్కడెక్కడ పర్యటన, ఉండాలి, రూట్ మ్యాప్ ఎలా ఉంటే మంచిదనే వివరాలపై చర్చించారు. పోలింగ్‌కు మరో 55 రోజుల సమయం ఉండటంతో వీలైనంతవరకూ ప్రజల్లోనే ఉండేలా ముఖ్యమంత్రి జగన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరించనున్నారు. ప్రజల్నించి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ జగన్ రోజుకో బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు.
Also read: Jio Cricket Recharge Plans: ఐపీఎల్ 2024 క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ జియో యూజర్లకు డేటా ప్యాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook