WPL Auction 2023: డబ్ల్యూపీఎల్ 2023 వేలం.. అత్యధిక ధర పలికిన టాప్ 10 ప్లేయర్లు వీరే!
WPL Auction 2023 Costliest Players List. బీసీసీఐ తొలిసారిగా నిర్వహించిన డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు ధర పలికింది.
WPL Auction 2023 Highest Price Players List: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2023 వేలం ముగిసింది. సోమవారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మొట్టమొదటి ఉమెన్స్ ఐపీఎల్ వేలం అట్టహాసంగా జరిగింది. ఈ వేలంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, యూపీ వారియర్స్ ఫ్రాంఛైజీలు పాల్గొన్నాయి. ఐదు ప్రాంఛైజీలు టాప్ ప్లేయర్ల కోసం పోటీపడ్డాయి. డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో ఆల్‌రౌండర్లు, హిట్టర్లు భారీ ధర పలికారు.
బీసీసీఐ తొలిసారిగా నిర్వహించిన డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు ధర పలికింది. అంతేకాదు తొలిసారి జరిగిన మహిళా వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంచైజీ రూ. 3.40 కోట్ల భారీ ధరకు మంధానను కొనుగోలు చేసింది. మంధాన కోసం ముంబై ఇండియన్స్ ప్రాంచైజీతో పోటీపడి మరీ బెంగళూరు దక్కించుకుంది.
డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో ఆరుగురు భారత క్రికెటర్లకు భారీ ధర పలికింది. స్మృతి మంధాన తర్వాత దీప్తి శర్మ అత్యధిక ధర దక్కించుకున్న రెండో ఇండియన్ క్రికెటర్‌గా నిలిచింది. యూపీ వారియర్స్ దీప్తిని రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. ఎడమ చేతి వాటం బ్యాటర్, కుడి చేతి వాటం బౌలర్ అయిన దీప్తి ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడనుందని యూపీ అధిక ధర పెట్టింది.
స్మృతి మంధాన తర్వాతి అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్ ఎంపికైంది. ఆష్లీని గుజరాత్ జెయింట్స్ రూ. 3.20 కోట్లకు తీసుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 3.20 కోట్లకు కైవసం చేసుకుంది. దీప్తి శర్మ తర్వాత భారత్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అత్యధిక ధర పలికింది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2.20 కోట్లకు జట్టులోకి తీసుకుంది.
అత్యధిక ధర పలికిన టాప్ 10 ప్లేయర్లు:
1. స్మృతి మంధాన (భారత్) - రూ.3.40 కోట్లు - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2. అష్‌లీ గార్డ్‌నర్ (ఆస్ట్రేలియా) - రూ. 3.20 కోట్లు - గుజరాత్ జెయింట్స్
3. సీవర్ నటాలియె (ఇంగ్లండ్) - రూ. 3.20 కోట్లు - ముంబై ఇండియన్స్
4. దీప్తి శర్మ (భారత్) - రూ.2.60 కోట్లు - యూపీ వారియర్స్
5. జెమీమా రోడ్రిగ్స్ (భారత్) - రూ. 2.20 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్
6. షఫాలీ వర్మ (భారత్) - రూ.2 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్
7. బేత్ మూనీ (ఆస్ట్రేలియా) - రూ.2 కోట్లు - గుజరాత్ జెయింట్స్
8. రీచా ఘోష్ (భారత్) - రూ.1.9 కోట్లు - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
9. హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్) - రూ.1.8 కోట్లు - ముంబై ఇండియన్స్
10. సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్) - రూ.1.8 కోట్లు - యూపీ వారియర్స్
Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే ఐఫోన్.. ఈ సువర్ణావకాశం మళ్లీమళ్లీ రాదు! కొనడానికి ఎగబడుతున్న జనం
Also Read: డబ్ల్యూపీఎల్ వేలంలో మంధానకు భారీ ధర.. ఈలలు, కేకలు వేసిన భారత అమ్మాయిలు! వీడియో చూడాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.