WPL 2024 Auction: పోటాపోటీగా WPL వేలం.. రికార్డు ధర దక్కించుకున్న అన్క్యాప్డ్ ప్లేయర్లు.. ఈ స్టార్లకు బిగ్ షాక్..!
WPL Auction 2024 Highlights: డబ్ల్యూపీఎల్ మినీ వేలం పోటాపోటీగా జరిగింది. అన్క్యాప్డ్ ప్లేయర్లు రికార్డు ధరకు అమ్ముడుపోగా.. స్టార్ ప్లేయర్లు అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు. ఎవరు ఎక్కువ ధర దక్కించుకున్నారు..? ఎవరు అమ్ముడుపోకుండా ఉండిపోయారు..? వివరాలు ఇలా..
WPL Auction 2024 Highlights: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 మినీ వేలం ముగిసింది. అందరీ అంచనాలను తలకిందులు చేస్తూ.. అన్ క్యాప్‌డ్ ప్లేయర్లు వేలంలో భారీ ధరకు అమ్ముడుపోగా.. భారీ ధర పలుకుతున్నారని అనుకున్న ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూపీఎల్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీలు వేలంలో పాల్గొన్నాయి.
30 స్లాట్లు ఖాళీ ఉండగా.. మొత్తం 165 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొన్నారు. ఇందులో 104 మంది ఇండియా ప్లేయర్లు కాగా.. 61 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో గుజరాత్ టీమ్ 10 మందిని కొనుగోలు చేయగా.. RCB ఏడుగురు, యూపీ వారియర్స్ 5, ముంబై ఇండియన్స్ 5, ఢిల్లీ క్యాపిటల్స్ ముగ్గురు ప్లేయర్లను వేలంలో కొనుగోలు చేశాయి.
వేలంలో కష్వీ గౌతమ్ చరిత్ర సృష్టించింది. ఆమె వేలంలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అవతరించింది. రూ.10 లక్షలు బేస్ ప్రైస్‌తో వేలంలోకి ఎంట్రీ ఇవ్వగా.. గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు రెండు కోట్లకు గుజరాత్ జట్టు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అనాబెల్ సదర్‌లాండ్ బేస్ ప్రైస్ రూ.30 లక్షలు కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్ల వేలంలో సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా పేస్ బౌలర్ షబ్నిమ్ కూడా వేలంలో మంచి ధర దక్కించుకుంది. బేస్ ప్రైస్ రూ.40 లక్షలు కాగా.. ముంబై ఇండియన్స్ రూ.1.2 కోట్లకు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్ లిచ్‌ఫీల్డ్‌ను రూ.1 కోటికి గుజరాత్ దక్కించుకుంది.
అన్‌క్యాప్‌డ్ బ్యాటర్ వింద్రా దినేశ్‌కు వేలంలో భారీ డిమాండ్ నెలకొంది. సూపర్ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్న వింద్రా రూ.10 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో పాల్గొనగా.. యూపీ వారియర్స్ రూ.1.3 కోట్లకు దక్కించుకుంది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు, వెస్టిండీస్‌కు చెందిన డియాండ్రా డాటిన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కిమ్ గార్థ్ వేలంలో అమ్ముడు పోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. టీమిండియా ఆల్‌రౌండర్ దేవిక వైద్య, స్టార్ ప్లేయర్లు సుష్మ వర్మ, భారతి ఫుల్మాలి, మోనా మెష్రామ్, పూనమ్ రౌత్‌లను వేలంలో ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఇక ఈ నెల 19న దుబాయ్ వేదికగా పురుషుల ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనుంది.
Also Read: WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?
Also Read: Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook