Wrestler Sushil Kumar Arrested: రెజ్లర్ సుశీల్ కుమార్‌ను అరెస్ట్ చేసిన స్పెషల్ టీమ్ పోలీసులు
Wrestler Sushil Kumar Arrested: జూనియర్ రెజ్లర్ హత్య కేసులు నిందితుడుగా ఉన్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను స్పెషల్ సెల్ పోలీసుల టీమ్ అరెస్ట్ (Wrestler Sushil Kumar Arrest) చేసింది. ఈ విషయాన్ని స్పెషల్ సెల్ సీపీ నీరజ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
స్టార్ రెజ్లర్, ఒలంపిక్ పతకం సాధించిన సుశీల్ కుమార్ ఎట్టకేలకు దొరికాడు. స్పెషల్ సెల్ పోలీసుల టీమ్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను అరెస్ట్ (Wrestler Sushil Kumar Arrested) చేసింది. ఈ విషయాన్ని స్పెషల్ సెల్ సీపీ నీరజ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. జూనియర్ రెజ్లర్ హత్యకేసులో నిందితుడిగా ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా ఇటీవల హత్యకు గురయ్యాడు. అయితే సుశీల్ కుమార్ అతడిపై దాడికి పాల్పడ్డాడని, దాంతో సాగర్ రాణా చనిపోయాడని కుటుంబసభ్యులు ఇటీవల ఫిర్యాదు చేశారు. తొలుత గొడవలో ఓ రెజ్లర్ చనిపోయాడని, మా వర్గం వ్యక్తి కాదు అంటూ సుశీల్ కుమార్ స్పందించాడు. తీరా విషయం తన మీదకి రావడం, కేసు సైతం నమోదు కావడంతో పరారీలో ఉన్నాడు. రెజ్లర్ సుశీల్ కుమార్ ఆచూకీ లభించకపోవడంతో లుక్‌ఔట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఆపై రెజ్లర్ సుశీల్ కుమార్ చెప్పిన వారికి రూ.1 లక్ష రూపాయల నజరానా కూడా ప్రకటించడం గమనార్హం.
గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో సుశీల్ కుమార్ కోసం దాదాపు 8 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పంజాబ్‌లోని అతడి స్నేహితులపై నిఘా ఉంచిన పోలీసులు ఎలాగోలా కొంత సమాచారం సేకరించారు. ఉత్తరప్రదేశ్ నుంచి పంజాబ్ వెళ్తుండగా టోల్‌గేట్ సీసీటీవీ ఫుటేజీలో రెజ్లర్ సుశీల్ కుమార్‌ను గుర్తించారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో గాలింపు చేపట్టిన ప్రత్యేక పోలీసుల టీమ్ సుశీల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook