Ricky Ponting Picks India Playing 11 for WTC 2023 Final: లండన్‌లోని ఓవల్‌ మైదానంలో బుధవారం నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023 ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచులో ఆస్ట్రేలియా, భారత్‌ తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌ ఇంగ్లాండ్‌లో జరుగుతుండటం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం. ఎందుకంటే ఆసీస్ మాదిరిగానే ఇంగ్లాండ్‌ వాతావరణం ఉంటుంది. ఇంగ్లీష్ పిచ్‌లు పేస్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. స్పిన్నర్లు పెద్దగా రాణించిన దాఖలు లేవు. దీంతో భారత్‌ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా?.. లేదా నాలుగు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో ఆడుతుందా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత్ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజాలను భారత్ తుది జట్టులోకి తీసుకుంటుందని ఆయన అంచనా వేశాడు. అయితే జడేజా కంటే అశ్విన్‌ మంచి ఎంపిక అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఐసీసీ రివ్యూలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ... 'రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లను భారత్‌ తుది జట్టులోకి తీసుకుంటుందనుకున్నా. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఆరో స్థానాన్ని జడేజా నిలబెట్టుకుంటాడు. జడ్డు బ్యాటింగ్ ఎంతో మెరుగుపడింది. కొన్ని ఓవర్లు బౌలింగ్‌ కూడా చేస్తాడు. కాబట్టి జడేజాను జట్టులోకి ఎంచుకోవచ్చు' అని అన్నాడు. 


'రవీంద్ర జడేజా కంటే ఆర్ అశ్విన్ చాలా నైపుణ్యమున్న, మెరుగైన టెస్ట్ బౌలర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. లోయర్‌ ఆర్డర్‌లో జడేజా బ్యాటింగ్‌లో రాణిస్తే.. ఆట నాలుగు లేదా ఐదో రోజు వరకు వెళ్లే అవకాశం ఉంది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంటే.. రెండో స్పిన్నర్‌గా జడేజా రూపంలో మంచి బౌలర్‌ టీమిండియాకు అందుబాటులో ఉంటాడు. నేను కెప్టెన్ అయితే జడేజాను కచ్చితంగా ఎంపిక చేస్తా' అని రికీ పాంటింగ్‌ పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియా ఒకే స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. సీనియర్ ప్లేయర్ నాథన్ లైయన్ తుది జట్టులో ఉంటాడు. 


భారత జట్టు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్.


Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ 2023.. రిషభ్‌ పంత్‌కు తుది జట్టులో చోటు!


Also Read: WTC Final 2023 India Playing XI: డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023.. తెలుగు ఆటగాడికి నో ఛాన్స్‌! భారత్ తుది జట్టు ఇదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK.