David Warner Comments on Rohit Sharma: టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో భారత్ బోణీ కొట్టింది. ఇంగ్లాండ్ పై 7 వికెట్ల తేడాతో విజయం  సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాటింగ్ కనిపించలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు బెంచ్‌లోనే కూర్చున్నాడు. అయితే ఇంతలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) రోహిత్ శర్మపై దొంగతనం చేశాడంటూ సోషల్ మీడియా(Soical Media)లో రచ్చ చేస్తున్నాడు. అసలేం జరిగిందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో రోహిత్ శర్మ(Rohit Sharma) యాక్టివ్‌గా ఉంటాడని తెలిసిందే. ఏదో ఒక వీడియోతో నెటిజన్లను అలరిస్తుంటాడు. తాజాగా టీమిండియా జెర్సీ(Teamindia Jersy)తో ఓ వీడియోను నెట్టింట్లో పంచుకున్నాడు. తన హోటల్ గదిలో టీమిండియా జెర్సీతో టిక్‌టాక్(Tik Tok) వీడియోలో చేసే మ్యాజిక్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఈవీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా రోహిత్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తూ, వీడియో బాగుంది అని కామెంట్లు చేశారు. అయితే డేవిడ్ వార్నర్ మాత్రం తనదైన శైలిలో రోహిత్ వీడియోకు కామెంట్ చేశాడు. ‘మీరు నా టిక్ టాక్ శైలిని కాపీ చేశారు’ అని సరదాగా కామెంట్ చేశాడు. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ కూడా ఫన్నీగా కామెంట్లు చేశారు.



 


Also read: India vs England warm-up match: వామప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఇండియా ఘన విజయం.. మెరిసిన Ishan Kishan, KL Rahul


రోహిత్ ఆడలేదు
అక్టోబర్ 18 న ఇంగ్లండ్‌తో టీమిండియా తన మొదటి వార్మప్ మ్యాచ్(First Warmup Match) ఆడింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కనిపించలేదు. రెండవ వార్మప్ మ్యాచ్‌లో ఆడతాడని భావిస్తున్నారు. అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో భారత్ తన తొలి కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. మరోవైపు, డేవిడ్ వార్నర్ న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో వార్నర్ ఖాతా కూడా తెరవలేదు. టిమ్ సౌథీ మొదటి బంతికే డేవిడ్ వికెట్‌ను పడగొట్టాడు.


ఇంగ్లండ్‌(England)తో జరిగిన తొలి వార్మ్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ తన బ్యాటింగ్ బలంపై ఈ విజయాన్ని సాధించింది. మరోవైపు, ఆస్ట్రేలియా(Australia) కూడా వార్మప్‌లో విజయాన్ని రుచి చూసింది. న్యూజిలాండ్‌ని 3 వికెట్లతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 158 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని సాధించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి