Yuvraj Singh Captaincy: అందుకే నేను టీమిండియా కెప్టెన్ కాలేకపోయా.. అసలు విషయం చెప్పిన యువరాజ్!
Yuvraj Singh about Team India Captaincy. యువరాజ్ సింగ్ టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా పనిచేయలేదు. తాను 2007లోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి ఉందని, కొన్ని పరిస్థితుల కారణంగా సాధ్యం కాలేకపోయిందన్నారు.
Yuvraj Singh revels how he missed Team India captaincy in 2007: యువరాజ్ సింగ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 17 ఏళ్ల పాటు టీమిండియాకు క్రికెట్ ఆడుతూ ఎన్నో ఘనతలు అందుకున్నారు. మంచి బ్యాటర్, బౌలర్‌గా మాత్రమే కాకుండా.. అంతకుమించి ఫీల్డర్‌గా కితాబులందుకున్నారు. టీమిండియా సాధించిన రెండు ప్రపంచకప్ (2007 టీ20, 2011 వన్డే) జట్టులో యువరాజ్ సభ్యుడిగా ఉన్నాడు. అలాంటి యువరాజ్ టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా మాత్రం పనిచేయలేదు. తాజాగా ఈ విషయంపై యూవీ స్పందించారు. తాను 2007లోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి ఉందని, కొన్ని పరిస్థితుల కారణంగా సాధ్యం కాలేకపోయిందన్నారు.
తాజాగా యువరాజ్ సింగ్ ఓ క్రీడా ఛానల్‌లో మాట్లాడుతూ... టీమిండియాకు 2007లో నేను కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చింది. అయితే అప్పటి కోచ్ గ్రేగ్ ఛాపెల్, సచిన్ టెండూల్కర్ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. అప్పుడు నేను సచిన్‌కు మద్దతుగా ఉన్నా. అది కొంతమంది బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. నన్ను తప్ప జట్టులోని ఎవరినైనా కెప్టెన్ చేయాలని వాళ్లు నిర్ణయించుకున్నట్లు నాకు తెలిసింది. వైస్ కెప్టెన్‌గా ఉన్న నన్ను తొలగించారు. 2007 టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాం. వీరేంద్ర సెహ్వాగ్ జట్టులో లేకపోవడంతో నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నా. నేనే కెప్టెన్ అవ్వాల్సింది కానీ ఎంఎస్ ధోనీని ఎంపిక చేశారు. ఆ విషయంలో నేనెప్పుడూ బాధపడలేదు' అని అన్నారు.
'2007 ప్రపంచకప్ గెలిచాం. కొద్ది రోజుల తర్వాత ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ బాగా చేస్తున్నాడని నేను అనుకున్నా. వన్డేల్లోనూ మహీకే నాయకత్వం ఇవ్వాలనుకున్నా. భారత జట్టుకు ఎంఎస్ ధోనీనే సరైన నాయకుడనుకున్నా. ఇక 2011లో వన్డే ప్రపంచకప్ అందుకున్నాం. ఆపై ధోనీ ఎన్నో విజయాలు అందించాడు. ఇక నేను వరుసగా గాయాలపాలయ్యాను. ఒకవేళ నన్ను కెప్టెన్‌గా చేసినా.. ఎక్కువ కాలం కొనసాగే వాడిని కాదనుకున్నా. ఏదేమైనా టీమిండియాకు నాయకత్వం వహించడం చాలా గొప్ప విషయంగా భావిస్తా. నేనెప్పుడూ జట్టు కోసమే ఆలోచిస్తా' అని యువరాజ్ సింగ్ తెలిపారు.
యువరాజ్ సింగ్ మొత్తంగా తన 19 ఏళ్ల కెరీర్‌లో 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8701 రన్స్, 58 టీ20ల్లో 1177 పరుగులు సాధించారు. వన్డేల్లో 14 సెంచరీలు చేసిన యువీ.. టెస్టుల్లో మూడు సెంచరీలు బాదారు. ఇక ఐపీఎల్ టోర్నీలో 132 మ్యాచులు ఆడి 2750 రన్స్ కొట్టారు. ఎక్కువగా పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడారు. 2019 జూన్ 10న యువరాజ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Also Read: Disha Patani: ప్రభాస్ సినిమాలో మరో బాలీవుడ్ భామ.. వెల్‌కమ్ చెపుతూ ఫ్లవర్ బొకే!
Also Read: Mother's Day 2022: మదర్స్ డే స్పెషల్.. అమ్మకు పంపాల్సిన బెస్ట్ మెసేజ్, కోట్‌లు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook