Mother's Day 2022: మదర్స్ డే స్పెషల్.. అమ్మకు పంపాల్సిన బెస్ట్ మెసేజ్, కోట్‌లు ఇవే!

Mother's Day 2022 Special wishes. ఈరోజు (మే 8) అంతర్జాతీయ మదర్స్ డే (మాతృదినోత్సవం) జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అమ్మకు ప్రత్యేకంగా విషెష్ చెప్పడం కోసం మెసేజ్‌లు, కోట్‌లు కింద సిద్ధముగా ఉన్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 8, 2022, 10:54 AM IST
  • నేడు అంతర్జాతీయ మదర్స్ డే
  • మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పి.. విషెస్ పంపితే ఆ ఆనందమే వేరు
  • మదర్స్ డే స్పెషల్.. అమ్మకు పంపాల్సిన బెస్ట్ మెసేజ్
Mother's Day 2022: మదర్స్ డే స్పెషల్.. అమ్మకు పంపాల్సిన బెస్ట్ మెసేజ్, కోట్‌లు ఇవే!

Mothers Day 2022: These Special messages, wishes and quotes sends to moms: 'అమ్మ' గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత, కమ్మదనం, తీయదనం, ఆనందం ఇంకా ఎన్నెన్నో.. మాటలకు అందనిదే అమ్మ ప్రేమ. ఈ ప్రపంచంలో ప్రేమను పంచే ఏకైక వ్యక్తి 'అమ్మ' మాత్రమే. ప్రేమను ఇవ్వడమే కానీ.. తిరిగి తీసుకోవడం అమ్మకు తెలియదు. ఈ లోకాన్ని సృష్టించిన ఆ దేవుడు కూడా అమ్మ కడుపునే పుట్టాడు. అంత గొప్పది అమ్మ. అమ్మ ప్రేమ గురించి వివరించడానికి ఈ భూ ప్రపంచంలో మాటలు లేవు. అలాంటి అమ్మకు ప్రతీక్షణం శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ఇక 'మదర్స్ డే' రోజు అయితే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పి.. విషెస్ పంపితే ఆ ఆనందమే వేరు. 

ఈరోజు (మే 8) అంతర్జాతీయ మదర్స్ డే (మాతృదినోత్సవం) జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తల్లి చేసే త్యాగం, తల్లి ఇచ్చే తోడు, తల్లి పంచే ప్రేమ..  అన్నీ గుర్తుచేసుకుంటూ అమ్మలందరికీ శుభాకాంక్షలు చెప్పుకుందాం. ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. వాట్సాప్, ట్విట్టర్, షేర్‌చాట్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అమ్మకు ప్రత్యేకంగా విషెష్ చెప్పడం కోసం మెసేజ్‌లు, కోట్‌లు కింద సిద్ధముగా ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు వేంటనే పంపేసుకొండి.

# అమ్మనూ మర్చిపోలేం, అమ్మ ప్రేమనూ మర్చిపోలేం.. అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. 
# అమ్మ లేకపోతే జననం లేదు.. అమ్మ లేకపోతే గమనం లేదు.. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు.. అమ్మే లేకపోతే అసలు సృష్టే లేదు. కంటిపాపలా కాపాడే అమ్మకి 'మదర్స్ డే' శుభాకాంక్షలు. 
# అమ్మా.. నా కోసం ఎన్నో త్యాగాలు చేశావు. నువ్వు చేసిన ప్రతిదానికీ చాలా థాంక్స్. నీకు 'మాతృదినోత్సవ' శుభాకాంక్షలు. 
# అమ్మంటే అంతులేని సొమ్ము.. అది ఏనాటికి తరగదు. అమ్మ మనసున అమృత.. అమ్మ ఒడిలో స్వర్గమే. 'హ్యపీ మదర్స్ డే'
# ప్రతి ఒక్కరి జీవితంలో తమ కోసం ప్రతీక్షణం ఎదురుచూసే వాళ్లు ఒకరుంటారు. వారెవరో కాదు అమ్మ. తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. 
# నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు.. అమ్మ. నిన్ను ఎప్పటికీ మర్చిపోను. హ్యాపీ 'మదర్స్ డే' అమ్మ. 
# అమ్మంటే వివరించడానికి భాష లేదు కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు. నాకు మరో జన్మంటూ ఉంటే.. నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మ. నీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. 
# ఆ కనిపించని దేవుడైనా.. కనిపెంచిన నీ తర్వాతే అమ్మా. మదర్స్ డే శుభాకాంక్షలు. 
# ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా.. నిన్ను ప్రేమించేది అమ్మ మాత్రమే. హ్యాపీ మదర్స్ డే అమ్మ. 

Also Read: Telangana Weather Forecast: తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు.. ఏపీకి తుపాన్ ముప్పు!

Also Read: Chris Gayle IPL: నాకు సరైన గౌరవం దక్కలేదు.. ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన క్రిస్ గేల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News