Yuzvendra Chahal: భువనేశ్వర్ కుమార్ రికార్డు బద్దలు.. తొలి బౌలర్‌గా యుజ్వేంద్ర చహల్!
Yuzvendra Chahal become India`s leading wicket-taker in T20Is. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ నిలిచాడు.
Yuzvendra Chahal breaks Bhuvneshwar Kumar Rare Record in T20Is: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా యూజీ నిలిచాడు. లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్‌ను బౌల్డ్ చేయడం ద్వారా ఈ రికార్డు సాధించాడు. 91 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చహల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రికార్డు బ్రేక్ చేశాడు.
యుజ్వేంద్ర చహల్ 75 టీ20 మ్యాచ్‌ల్లో 91 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు సాధించాడు. రెండో టీ20 మ్యాచ్‌కు ముందు భువనేశ్వర్‌తో సమానంగా ఉన్న యుజీ.. ఫిన్ అలెన్ వికెట్ పడగొట్టడంతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ఇక టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ అగ్ర స్థానంలో ఉన్నాడు. సౌథీ 107 మ్యాచ్‌ల్లో 134 వికెట్స్ పడగొట్టాడు. షకీబ్ అల్ హసన్ (109 మ్యాచ్‌ల్లో 128), రషీద్ ఖాన్ (74 మ్యాచ్‌ల్లో 122) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ మిషెల్ శాంట్నర్ (19) టాప్ స్కోరర్. ఫిన్ అలెన్ (11), డెవాన్ కాన్వే (11), చాప్‌మన్ (14), బ్రాస్‌వెల్ (14) విఫలమయ్యారు. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్స్ పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, దీపికా హుడా, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 101 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (26 నాటౌట్) టాప్ స్కోరర్.
Also Read: Shubman Gill: శుబ్‌మన్ గిల్ టీ20లకు పనికిరాడు.. అతడిని తుది జట్టులో తీసుకురండి!
Also Read: Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ బాల్.. బ్యాట్స్‌మెన్ దిమ్మతిరిగింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.