Asia Cup 2023: చాహల్‌ను పక్కనపెట్టిన బీసీసీఐ.. భార్య ధన్యశ్రీ సీరియస్ పోస్ట్..!
Yuzvendra Chahal wife Dhanashree Verma Serious Note: ఆసియా కప్‌లో తన భర్త చాహల్‌కు జట్టులో చోటు కల్పించకపోవడంపై ధన్యశ్రీ వర్మ సీరియస్ పోస్ట్ పెట్టారు. మరీ ఎక్కువగా లొంగి ఉండటం తప్పా..? అని రీతిలో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Yuzvendra Chahal wife Dhanashree Verma Serious Note: ఆసియా కప్‌కు 17 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. గాయాల తరువాత కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వగా.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. జట్టులో స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ను ఎంపిక చేయగా.. స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను తీసుకుంది. అయితే మరో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు సెలెక్టర్లు మొండి చేయి చూపారు. తనకు జట్టులో చోటు కల్పించకపోవడంవై సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు.. అని అర్థం వచ్చేలా చాహల్ పోస్ట్ పెట్టాడు. ఈ మణికట్టు మాంత్రికుడిని జట్టులోకి తీసుకోవాల్సిందని క్రికెట్ అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.
చాహల్‌ను టీమిండియా జట్టు నుంచి తొలగించినందుకు అతని భార్య ధనశ్రీ వర్మ స్పందించారు. డైరెక్ట్‌గా బీసీసీఐని ప్రశ్శించకపోయినా.. పోస్ట్ మాత్రం జట్టులో చాహల్‌ను తీసుకోకపోవడంపైనే అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని తాను చాలా తీవ్రంగా ప్రశ్నించడం మొదలుపెట్టానని అన్నారు. మరీ ఎక్కువగా లొంగి ఉండటం.. ఇంట్రావర్ట్‌గా ఉండటం చేస్తున్న పనిలో ఎదగడానికి అడ్డంకినా..? అని ప్రశ్నించారు. లేదంటే లైఫ్‌లో పైకి రావడానికి మనమందరం ఎక్స్‌ట్రావర్ట్, స్మార్ట్‌గా ఉండాలా..? అని అడిగారు. దేవుడు గొప్పొడని.. అదృష్టవశాత్తూ ప్రపంచం మీతోనే ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఏడాది చాహల్‌కు కేవలం రెండు వన్డేల్లోనే ఆడే అవకాశం లభించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ఆసియా కప్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ. బ్యాకప్ ప్లేయర్: సంజూ శాంసన్
Also Read: TS Politics: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.. పార్టీ మారనున్న నేతలు వీళ్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి