Zaheer Khan feels R Ashwin will breaks Anil Kumble's highest wickets record in Tests: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ (R Ashwin)పై భారత మాజీ పేసర్ జహీర్‌ ఖాన్‌ (Zaheer Khan) ప్రశంసల వర్షం కురిపించారు. బౌలింగ్‌లో ఎప్పటికప్పుడూ వైవిధ్యం చూపుతూ యాష్ వికెట్లు పడగొడుతున్నాడన్నాడు. అశ్విన్ ఇదే ఫామ్‌ను మరి కొన్నేళ్లు కొనసాగిస్తే.. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ( Anil Kumble) రికార్డును కూడా బద్దలు కొడతాడని జహీర్‌ అభిప్రాయపడ్డాడు. అశ్విన్ భారత జట్టులోకి వచ్చినప్పటి నుంచి వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ఫార్మాతో సంబంధం లేకుండా వికెట్లు పడగొడుతున్నాడు. అయితే ఇటీవలి కాలంలో యువకుల రాకతో ఎక్కువగా టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ ట్రోఫీ కైవసం చేసుకోవడంలో ఆర్ అశ్విన్‌ (R Ashwin) కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల్లో 11.35 ఎకానమీ రేట్‌తో 14 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులో 6, రెండో టెస్టులో 8 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే టీమిండియా వెటరన్ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ (417 వికెట్లు) రికార్డును అధిగమించాడు. దీంతో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. యాష్ ఖాతాలో ప్రస్తుతం 427 వికెట్లు ఉన్నాయి. అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లే (619 వికెట్లు), కపిల్ దేవ్‌ (434 వికెట్లు) ఉన్నారు. 


Also Read: Bipin Rawat chopper crash: ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో CDS బిపిన్ రావత్‌కి తీవ్ర గాయాలు


తాజాగా బెల్ బాజీ (BalleBaazi.com)తో జహీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ... 'టెస్టు క్రికెట్లో రవిచంద్రన్‌ అశ్విన్ తనకంటూ ఓ ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు. బౌలింగ్‌లో ఎప్పటికప్పుడూ వైవిధ్యం చూపిస్తున్నాడు. కచ్చితత్వంతో బంతులేస్తున్నాడు. అతడి చేతిలో బంతి ఉంటే.. ఏదో మాయ చేస్తాడు. బ్యాటర్ కదలికలను బట్టి బంతులను సాధిస్తాడు. అందుకే భారత జట్టులోకి ఎంతో మంది యువ ఆటగాళ్లు వస్తున్నా.. యాష్ చాలా ఏళ్లుగా టెస్టు క్రికెట్లో కొనసాగగలుగుతున్నాడు. ఇదే ఫామ్‌ను మరి కొన్నేళ్ల పాటు కొనసాగిస్తే అనిల్ కుంబ్లే రికార్డు బద్దలవుతుంది' అని అన్నారు. 


Also Read: Bipin Rawat Helicopter Accident: హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులిక


'స్వదేశంలో ఆధిపత్య విజయాన్ని చూడటం చాలా గొప్పగా ఉంది. పాత రోజులు గుర్తుకువచ్చాయి. టెస్ట్ మ్యాచ్ చివరి రోజున పిచ్ ప్రవర్తించిన తీరు చూస్తే.. జయంత్ యాదవ్ బాగా బౌలింగ్ చేశాడు. అతడి ప్రదర్శన నన్ను ఆకట్టుకుంది. ఐదుగురు బౌలర్లను తీసుకోవాలన్న ఆలోచన సరైందే అని నిరూపించాడు. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం ప్లేయర్స్ ఉన్నప్పుడు. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు భారత జట్టుకు అందుబాటులో ఉండడం బాగుంది' అని జహీర్‌ ఖాన్‌ పేర్కొన్నారు. ఇక భారత్ త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook