Zimbabwe's Brendan Taylor Announces Retirement: జింబాబ్వే మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ బ్రెండన్‌ టేలర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా(Social Media) వేదికగా వెల్లడించాడు. ఐర్లాండ్‌(Ireland)తో నేడు(సెప్టెంబరు 13) జరిగే మూడో వన్డే తన చివరి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ అని పేర్కొన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానని, అరంగేట్రం చేసిన నాటి నుంచి జట్టును మెరుగైన స్థితిలో ఉంచేందుకు తన వంతు కృషి చేశానని పేర్కొన్నాడు. బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నానంటూ ట్విటర్‌(Twitter) వేదికగా టేలర్‌(Brendan Taylor) ఓ భావోద్వేగ నోట్‌ షేర్‌ చేశాడు. తన ఎదుగుదలకు తోడ్పడిన జింబాబ్వే క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌, కోచ్‌లు, అభిమానులు, సహచర ఆటగాళ్లు, తన కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.



Also Read: Mohammad Amir: 'రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటున్నా...ఆడేందుకు సిద్దమే': పాక్ పేసర్


క్రికెట్ ప్రస్థానం..
బ్రెండన్‌ టేలర్‌(Brendan Taylor) 2004లో అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు మొత్తంగా 34 టెస్టులాడిన అతడు... 2320 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌ విషయానికొస్తే... 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన టేలర్‌.. 118.22 స్ట్రైక్‌రేటుతో 934 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ద శతకాలు ఉన్నాయి. ఇక తనెంతగానో ఇష్టపడే వన్డే క్రికెట్‌లో 204 మ్యాచ్‌లు ఆడి.. 6677 పరుగులతో సత్తా చాటిన టేలర్‌.. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు(11) చేసిన ఆటగాడిగా తన పేరు లిఖించుకున్నాడు. ప్రస్తుతం ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా మూడో వన్డే ఆడిన అనంతరం ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి అతడు నిష్క్రమించనున్నాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook