Infinix Note 40 - Note 40 Pro Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఇన్ఫినిక్స్ త్వరలోనే మరో గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది.  కొత్త సిరీస్‌లో మార్కెట్‌లోకి మొబైల్స్‌ను లాంచ్‌ చేయబోతున్నాయి. కంపెనీ వీటిని ఇన్ఫినిక్స్ నోట్ 40, నోట్ 40 ప్రో రెండు వేరియంట్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే లాంచింగ్‌కి ముందే ఈ స్మార్ట్‌ఫోన్స్‌ డిజైన్‌, ఇతర వివరాలు లీక్ అయ్యాయి. అయితే ఈ లీకైన డిజైన్‌ని బట్టి చూస్తే ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శక్తివంతమైన కెమెరాలతో అందుబాటులోకి రాబోతున్నట్లు టిప్‌స్టర్స్‌ తెలుపుతున్నారు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్ఫినిక్స్ నోట్ 40, నోట్ 40 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌ పూర్తి వివరాలను టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ X (గతంలో ట్విట్టర్)లో పేర్కొన్నారు. లీక్‌ అయిన ఫోటోస్‌ ప్రకారం.. ఇన్ఫినిక్స్ నోట్ 40 స్మార్ట్‌ఫోన్‌ ముందు భాగంలో ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బ్యాక్‌ సెటప్‌లో  LED ఫ్లాష్‌తో రెండు శక్తివంతమైన డబుల్‌ కెమెరా సెటప్‌తో మూడు ఇమేజ్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా నోట్ 40 ప్రో మాత్రం పంచ్‌ హోల్  AMOLED డిస్‌ప్లేను కలిగే ఉండే అవకాశాలు ఉన్నాయని టిప్‌స్టర్‌ తెలిపారు. అంతేకాకుండా మరెన్నో ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.   


ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో కుడి వైపున పవర్ బటన్‌తో పాటు వాల్యూమ్ రాకర్స్ కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది పంచ్ హోల్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్‌ స్టాండర్డ్ మోడల్ 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రాబోతోంది. అలాగే ప్రో వేరియంట్‌ విషయానికొస్తే, 70W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ని కలిగి ఉంటుంది. టిప్‌స్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇన్ఫినిక్స్ నోట్ 40 స్మార్ట్‌ఫోన్‌ రూ.15,000 ధరతో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో మొబైల్‌ ధర రూ.18,000తో మార్కెట్‌లో లభించబోతోంది. ఈ రెండు మొబైల్స్‌ను కంపెనీ మార్చి 18న లాంచ్‌ చేసే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది. 


ఇన్ఫినిక్స్ నోట్ 40, నోట్ 40 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌ ఫీచర్స్‌(అంచనాలు):
డిస్ప్లే:

ఇన్ఫినిక్స్ నోట్ 40: 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో: 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్


ప్రాసెసర్:
ఇన్ఫినిక్స్ నోట్ 40: MediaTek Helio G88 ప్రాసెసర్
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో: MediaTek Helio G99 ప్రాసెసర్


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


RAM & స్టోరేజ్:
ఇన్ఫినిక్స్ నోట్ 40: 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో: 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్


కెమెరా:
ఇన్ఫినిక్స్ నోట్ 40: 50MP ట్రిపుల్ రియర్ కెమెరా (ప్రధాన + అల్ట్రావైడ్ + డెప్త్) + 16MP సెల్ఫీ కెమెరా
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో: 64MP ట్రిపుల్ రియర్ కెమెరా (ప్రధాన + అల్ట్రావైడ్ + డెప్త్) + 32MP సెల్ఫీ కెమెరా


బ్యాటరీ:
ఇన్ఫినిక్స్ నోట్ 40: 5000mAh బ్యాటరీ + 45W ఫాస్ట్ ఛార్జింగ్
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో: 6000mAh బ్యాటరీ + 70W ఫాస్ట్ ఛార్జింగ్


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి