Ad Free Youtube 2024: యాడ్స్ రాకుండా యూట్యూబ్లో వీడియోలు చూడాలనుకుంటున్నారా? ఈ సింపుల్ ట్రిక్ మీకోసమే..
Best Ad Free Youtube For Android 2024 Telugu: యూట్యూబ్ వినియోగం పెరగడం కారణంగా.. దీనిని దృష్టిలో పెట్టుకొని గూగుల్ యాడ్ ఫ్రీ వీడియో ఆప్షన్ని తొలగించింది. అయితే ఈ ఆప్షన్ పొందడానికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా కూడా యూట్యూబ్లో వీడియోలను చూడవచ్చు.
Best Ad Free Youtube For Android 2024 Telugu: ప్రస్తుతం యూట్యూబ్ అనేది పెద్ద ప్రపంచం గా మారింది. అన్ని విషయాలు గూగుల్లో కంటే యూట్యూబ్‌లోనే ఎక్కువమంది సెర్చ్ చేస్తున్నారు దీనికి కారణంగా మార్కెట్లో యూట్యూబ్ వ్యాల్యూ చాలా పెరిగింది అంతేకాకుండా కోట్లాది కొత్త చానల్స్ పుట్టుకు వచ్చాయి. ముఖ్యంగా చాలామందికి యూట్యూబ్ ఒక ఓటిటి ప్లాట్ఫార్మ్‌గా కూడా మారింది. కొంతమంది ఇందులో సినిమాలను కూడా ఎక్కువగా చూస్తూ ఉంటున్నారు. అలాగే కొంతమంది విద్యార్థులు ట్యుటోరియల్స్ చానల్స్ ద్వారా పాఠాలను కూడా చూడడంతో పాటు వినగలుగుతున్నారు.
ప్రస్తుతం ఒకప్పుడు ఉన్న దానికంటే యూట్యూబ్ వినియోగదారుల సంఖ్య ఇప్పుడు 100 శాతం ఎక్కువగా పెరిగింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ కంపెనీ వీడియో మధ్య మధ్యలో యాడ్స్ ని ఎక్కువగా జనరేట్ చేస్తూ ఉంటుంది. దీని కారణంగా సినిమా లేదా ఏదైనా ట్యుటోరియల్ చూసినప్పుడు మధ్యలో చాలామందికి అంతరాయం కలుగుతుంది. అయితే యూట్యూబ్లో యాడ్స్ లేకుండా వీడియోలు చూడొచ్చా?
యూట్యూబ్‌లో యాడ్స్ రాకుండా వీడియోస్ చూడొచ్చు కానీ దీనికి యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం నెలకు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా యూట్యూబ్ లో యాడ్ ఫ్రీ వీడియోస్ చూడగలిగే ఒక ట్రిక్ ను అందించబోతున్నాం. దీనికోసం ముందుగా మీరు ప్లే స్టోర్ లోని వీడియో లైట్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ యాప్ ని ఓపెన్ చేస్తే అది మీకు బ్రౌజర్ లా కనిపిస్తుంది. అందులోనే మీ స్క్రీన్ పై యూట్యూబ్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు నేరుగా యూట్యూబ్‌లోకి వెళ్తారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఆ తర్వాత పక్కనే లాగిన్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఈ లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీ లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత మీ యూట్యూబ్ అకౌంట్ అందులో కనిపిస్తుంది. ఇక మీరు ఎలాంటి సబ్ స్క్రిప్షన్ కట్టకుండానే అన్ని రకాల వీడియోలను యాడ్ ఫ్రీగా చూడవచ్చు. దీంతోపాటు ఇందులో యాడ్ ఫ్రీ మ్యూజిక్ ఆప్షన్ కూడా అందిస్తోంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter