Aditya L1 Solar Mission Countdown: చంద్రయాన్ -3 ద్వారా ఓవైపు చంద్రుడిపై ఖనిజాల గుర్తింపు, వాతావరణం, వాయువులపై అధ్యయనం చేస్తూనే మరోవైపు సూర్యుడిని దగ్గరి నుండి పరిశీలించేందుకు ఆదిత్య L1 ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో శ్రీకారం చుట్టబోతోంది. ఔను ఆదిత్య L1 ప్రయోగం ముహూర్తానికి కౌంట్ డౌన్ షురూ అయింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే రేపు సెప్టెంబర్ 2న శనివారం నాడు ఉదయం 11: 50 గంటలకు ఆదిత్య L1 ప్రయోగం జరగనుంది. ఆదిత్య L1 ప్రయోగం పీఎస్ఎల్వీ -C57 రాకెట్ ఉపయోగిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం ఉదయం 11:50 గంటలకు పీఎస్ఎల్వీ -C57 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోనున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటల నుంచే కౌంట్‌డౌన్ షురూ అయిందని.. రాకెట్ ప్రయోగానికి మరో 23 గంటల 40 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది అని ఇస్రో స్పష్టంచేసింది. 


పీఎస్ఎల్వీ -C57 రాకెట్ లాంచింగ్ కౌంట్ డౌన్ షురూ అయిందని ట్వీట్ చేసిన ఇస్రో.. ఆదిత్య L1 ని కక్ష్యలోకి ప్రవేశపెట్టే రాకెట్ లాంచింగ్ ప్రయోగాన్ని ఎప్పుడు, ఎక్కడి నుండి ఎలా వీక్షించ వచ్చు అనే వివరాలను సైతం వెల్లడించింది 


ఆదిత్య L1 ప్రయోగం లైవ్ స్ట్రీమింగ్ వివరాలు :
ఆదిత్య L1 ప్రయోగం లైవ్ స్ట్రీమింగ్ కోసం భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రోకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లేదా దూరదర్శన్ నేషనల్ టీవీ ఛానెల్, అలాగే ఇస్రో అధికారిక వెబ్ సైట్, ఇస్రో యూట్యూబ్ ఛానెల్లో ఆదిత్య L1 ప్రయోగం లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది అని ఇస్రో వెల్లడించింది.  



ఇది కూడా చదవండి : Aditya L1 PSLV C-57 count down: ఆదిత్య L1 పీఎస్ఎల్వీ C-57 ప్రయోగానికి కౌంట్ డౌన్


ఆదిత్య-L1 ప్రయోగంలో భాగంగా సూర్యుడికి, భూమికి మధ్య భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 లాగ్రాంజియన్ పాయింట్ వద్ద నుండి సౌర కరోనా రిమోట్ అబ్జర్వేషన్స్ ఇస్రో అధ్యయనం చేయనుంది. సూర్యుడిపై అధ్యయనం కోసం మన దేశం ప్రయోగిస్తున్న మొట్టమొదటి సోలార్ మిషన్ ఇదే అవుతుంది. ఆదిత్య L1 ప్రయోగం కోసం PSLV-C57 రాకెట్ ఉపయోగిస్తున్నారు. బుధవారమే ఆదిత్య L1 మిషన్ ప్రయోగానికి సంబంధించిన రాకెట్ లో సాంకేతిక తనిఖీలు, రిహార్సల్ పూర్తయ్యాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. సూర్యుడి చుట్టూ ఉన్న లాంగ్రెజియన్ పాయింట్ అనే L1 కక్ష్య నుండి సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొరలను అధ్యయనం చేసే లక్ష్యంతో ఈ ఆదిత్య L1 మిషన్ చేపడుతున్నారు.


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి