TiE Delhi-NCR`s iDay2023: ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ రంగంలో స్టార్టప్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు ఇదే మా ఆహ్వానం
TiE Delhi-NCR`s 12th Edition Events: న్యూఢిల్లీ: స్టార్టప్ కంపెనీలను స్థాపించే ఔత్సాహికులను, అలాగే వారితో చేతులు కలిపి పెట్టుబడి సహాయంతో చేయుతను అందించే పెట్టుబడిదారులకు మధ్య వారధిగా నిలిచిన ది ఇండస్ ఎంటర్ ప్రెన్యూవర్స్ కి చెందిన ఢిల్లీ విభాగం, TiE Delhi-NCR ఔత్సాహిక స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులకు గుడ్ న్యూస్ చెప్పింది.
TiE Delhi-NCR's 12th Edition Invites You: ఎన్నో స్టార్టప్ కంపెనీలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన TiE Delhi-NCR చాంబర్ ఆధ్వర్యంలో 12వ ఎడిషన్ ఇండియా ఇంటర్నెట్ డే (iDay2023) పేరుతో మరోసారి ఔత్సాహిక వ్యవస్థాపకులకు, అలాగే ప్రముఖ పెట్టుబడిదారులకు స్వాగతం పలుకుతోంది. సాంకేతిక రంగంలో అద్భుతాలు సాధించాలని కలలు కంటున్న ఔత్సాహికులకు ఇదే సరైన అవకాశం.. ఇదే సరైన వేదిక. ఈ నెల 24, 25, 29 తేదీలలో ఇండియాలోనే ప్రముఖ స్టార్టప్ హబ్స్ గా పేరున్న బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, భువనేశ్వర్ వంటి నగరాలు వేదిక కానున్నాయి.
ఇండియాలో ఉన్న ఔత్సాహిక టెక్నోప్రెన్యువర్లు, పెట్టుబడిదారులు ఒక్క చోట కలిసి పనిచేస్తూ సాంకేతిక రంగంలో ప్రపంచ పటంలో భారత్ ని అగ్రభాగాన నిలబెట్టేందుకు కృషి చేస్తోన్న TiE Delhi-NCR సరికొత్త ప్రయత్నమే ఈ ఇండియా ఇంటర్నెట్ డే. ప్రస్తుతం యావత్ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ వెంట పరుగెడుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం iDay 2023 థీమ్‌తో కార్యక్రమాలను ప్లాన్ చేయడమే కాకుండా ఆ దిశగా ఆవిష్కరణలకు పాటు పడుతున్న ఔత్సాహిక వ్యవస్థాపకులకు, వారికి చేయూతను అందించి ముందుకు నడిపించే ఇన్వెస్టర్స్ కి TiE Delhi-NCR మీకు స్వాగతం పలుకుతోంది.
ఇండియాలో వివిధ కోణాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ రంగంలో మెరికలైన ఔత్సాహిక ఆవిష్కర్తలకు ఊతమిచ్చేలా iDay 2023 థీమ్‌ని తీర్చిదిద్దినట్టు TiE Delhi-NCR నిర్వాహకులు తెలిపారు.
భారత సాంకేతిక రంగాన్ని మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న ఈ ఈవెంట్స్ లో ప్రముఖ వక్తలు, ఎన్నో సంస్థలను తీర్చిదిద్ది వాటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన ఇన్‌స్టిట్యూషన్ బిల్డర్స్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, దేశంలోనే పేరున్న పెట్టుబడిదారులు, దేశంలో అత్యున్నత చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాలసీ మేకర్స్ పాల్గొననుండటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.
నిపుణుల ప్యానెల్‌లలో కర్ణాటక ఐటి, గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గే, ఓలా క్యాబ్స్ & ఓలా ఎలక్ట్రిక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్, హవాస్ ఇండియా సంస్థ గ్రూప్ సీఈఓ రానా బరువా, కలారి క్యాపిటల్ సంస్థ ఎండీ వాణి కోలా, వెబ్‌వేద వ్యవస్థాపకుడు అంకుర్ వారికూ, గుడ్ గ్లామ్ గ్రూప్ కో-ఫౌండర్, సీఈఓ అయిన ప్రియాంక గిల్ , లెన్స్‌కార్ట్ సంస్థ కో-ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ & పీపుల్ ఆఫీసర్పీయుష్ బన్సల్, మేక్‌మైట్రిప్ ఫౌండర్ & చైర్మన్ దీప్ కల్రా , పీక్ ఎక్స్‌వీ పార్ట్‌నర్స్ & సర్జ్ సంస్థ ఎండీ రాజన్ ఆనందన్, ఆఫ్‌బిజినెస్ & ఆక్సిజో సంస్థ సహ వ్యవస్థాపకుడు & సీఈఓ ఆశిష్ మోహపాత్రా, మ్యాజిక్‌పిన్ సహ వ్యవస్థాపకుడు & సీఈఓ అన్షూ శర్మ తో పాటు ఇంకెంతో మంది సక్సెస్ ఫుల్ ఎంటర్ ప్రెన్యువర్స్ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోనున్నారు.
TiE Delhi-NCR ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతికా దయాల్ iDay 2023 గురించి మాట్లాడుతూ, "TiE Delhi-NCR 2012లో తొలిసారి ఈ తరహా కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిందని.. ఆ తరువాత ఇదొక విజయ పరంపరగా ముందుకు సాగుతూ ఎన్నో విజయాలను అందుకుంటోంది అని అన్నారు. గతేడాది నిర్వహించిన ఇండియా ఇంటర్నెట్ డే కార్యక్రమం ద్వారా దేశంలోని రెండు స్టార్టప్ రాజధానులైన బెంగళూరు, ఢిల్లీ-NCR లకు విస్తరించిందన్నారు. ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని భువనేశ్వర్ కి సైతం తీసుకెళ్తున్నట్టు గీతికా దయాల్ తెలిపారు. ఇండియాలో గేమ్ చేంజర్ గా నిలవనున్న ఎన్నో ఆవిష్కరణలకు, ప్రముఖులతో కలిసి లంచ్ మీటింగ్స్‌కి ఈ ఏడాది ఇండియా ఇంటర్నెట్ డే వేదిక కాబోతోందని గీతికా దయాల్ చెప్పుకొచ్చారు.
ఈ కాన్ఫరెన్స్‌కు స్టార్టప్ ఇండియా, హవాస్ మీడియా నెట్‌వర్క్ ఇండియా, పీక్‌ఎక్స్‌వి, మైక్రోసాఫ్ట్, వాకో బైనరీ సెమాంటిక్స్, శాప్, ఏడబ్లూఎస్, లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్, క్రెడ్, STPi, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు సహకారం అందిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : EPF Interest Credited or Not: పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది ? ఖాతాల్లో ఉన్న మొత్తంపై వడ్డీ ఎందుకు రాదు ?
మరి ఇంకెందుకు ఆలస్యం.. ఎన్నో ఔత్సాహిక స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడిదారులను... అలాగే ఎందరో పేరున్న పెట్టుబడిదారులకు ఔత్సాహికులైన ఆవిష్కర్తలను పరిచయం చేసిన TiE Delhi-NCR నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌లో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే TiE Delhi-NCR అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి తగిన వివరాలు సమర్పించి మీ పేరును నమోదు చేసుకోండి... మూడు రోజుల పాటు మూడు వేర్వేరు నగరాల్లో.. అంటే.. ఆగస్టు 24న బెంగుళూరులో, ఆగస్టు 25న ఢిల్లీలో, అలాగే ఆగస్టు 29న భువనేశ్వర్‌లో జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని అందుకోండి.
ఇది కూడా చదవండి : Top Electric Cars in India: ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి