Amazon Mobile Offers: దసరా పండగ సందర్భంగా అన్ని కామర్స్ కంపెనీలు అతి తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్‌లోని దసరా సీజన్ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లు సగం ధరలకే లభిస్తున్నాయి. మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను రూ.10,000 లోపే కొనుగోలు చేయాలని అనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ అమెజాన్ సేల్‌లో అన్ని స్మార్ట్ ఫోన్లు దాదాపు 50 శాతం లభిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై అమెజాన్ బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. మీరు కూడా మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ సేల్‌లో ఏయే బ్రాండ్లపై ఎంత తగ్గింపు లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

50 శాతం తగ్గింపు ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఇవే:
Redmi 12C:

అమెజాన్ సేల్ లో భాగంగా Redmi 12C స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే బడ్జెట్ ఫ్రెండ్లీగా పొందవచ్చు. ఈ మొబైల్ ప్రస్తుతం అత్యంత చౌకగా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను మొదట అమెజాన్MRP రూ. 13,999తో విక్రయించగా ఈ సేల్‌లో రూ.6,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ అనేక రకాల కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ ఫోన్ MediaTek Helio G85 ప్రాసెసర్‌ పై పనిచేస్తుంది.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  


Redmi A2:
అమెజాన్ పండగ  సేల్ లో భాగంగా ప్రీమియం ఫీచర్స్ కలిగిన Redmi A2 స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్ పై ఆధారంగా 47% వరకు తగ్గింపు లభిస్తుంది. కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను MRP రూ. 9,999కు విక్రయించగా.. ఈ పండగ సేల్ లో భాగంగా 5,299కే లభిస్తోంది. దీంతోపాటు మీరు ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు.


Samsung Galaxy M04:
ఈ స్మార్ట్ ఫోన్ పై కూడా అమెజాన్ భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ MediaTek Helio P35 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ పై పని చేస్తుంది. ఈ పండగ సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే 44% తగ్గింపుతో లభించనుంది. ఇక డిస్కౌంట్ ఆఫర్లు పోను ఈ మొబైల్ రూ.7,499కే పొందవచ్చు. దీంతోపాటు ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ల కోసం అమెజాన్ అధికారిక వెబ్సైట్ ని సందర్శించాల్సి ఉంటుంది.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.