Apple Plans to release iPhone 14 in yellow color: యాపిల్ యొక్క ఐఫోన్ 14 (Apple iPhone 14) సిరీస్ చాలా ప్రజాదరణ పొందింది. ఈ సిరీస్‌లోని నాలుగు మోడల్‌లు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు ఐఫోన్ లవర్స్ ఐఫోన్ 14ని కొత్త రంగులో చూడనున్నారు. జపనీస్ బ్లాగ్ MacOtakara ద్వారా భాగస్వామ్యం చేయబడిన Weibo పోస్ట్ ప్రకారం... టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త మోడల్‌ను ఈ వసంతకాలంలో పసుపు రంగులో రిలీజ్ చేయాలని చేయాలని ప్లాన్ చేస్తోంది. పసుపు రంగులో రిలీజ్ కానున్న ఐఫోన్ 14 పూర్తి వివరాలు ఓసారి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Weibo ఖాతా MacOtakaraకి పెద్దగా ట్రాక్ రికార్డ్ లేదు. కాబట్టి ఐఫోన్ 14 పసుపు రంగులో వచ్చే వార్త సరైనదో కాదో చెప్పలేము. అయితే ఆపిల్ యొక్క PR బృందం వచ్చే వారం ఉత్పత్తి బ్రీఫింగ్‌ను ప్లాన్ చేస్తోందని MacRumors నివేదించింది. ఐఫోన్‌ను కొత్త రంగులో (Apple iPhone 14 New Color) ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొంది. అంటే ఐఫోన్ 14 పసుపు రంగులో వచ్చేది లేనిది మరో వారం, పది రోజుల్లో తేలిపోనుంది. 


అమ్మకాలు మరియు మీడియా దృష్టిని ఆకర్షించడానికి యాపిల్ కంపెనీ ఎల్లప్పుడూ కొత్త రంగు ఎంపికలను పరిచయం చేస్తోంది. గత సంవత్సరం ఐఫోన్ 13 సిరీస్‌ను ఆకుపచ్చ రంగుకి పరిచయం చేసింది. ఏప్రిల్ 2021లో ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 12 మినీలను పర్పుల్ కలర్‌లో తీసుకొచ్చింది. ఇప్పుడు ఐఫోన్ 14ని పసుపు రంగులో తీసుకోచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. 


ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్ ప్రస్తుతం బ్లూ, పర్పుల్, మిడ్‌నైట్ (బ్లాక్), స్టార్‌లైట్ (వైట్/సిల్వర్) మరియు ప్రొడక్ట్ రెడ్ రంగు ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఐఫోన్ 14 ప్రో మోడల్‌లు డీప్ పర్పుల్, గోల్డ్, సిల్వర్ మరియు స్పేస్‌లో వస్తాయి. ప్రో మోడల్‌లు పసుపు రంగు ఎంపికను పొందుతాయా లేదా అనేది అస్పష్టంగా ఉంది. కొంతమంది యాపిల్ లవర్స్ పసుపు ఐఫోన్ 14 గురించి సంతోషిస్తున్నప్పటికీ..మరికొందరు ప్రకాశవంతమైన రంగు నాన్-ప్రో మోడల్‌లకు మాత్రమే సరిపోతుందని భావించవచ్చు.


Also Read: Lakshmi Jayanti 2023: రేపు లక్ష్మీదేవి జయంతి.. ఈ తప్పులు చేశారో ఆర్థిక సంక్షోభం తప్పదు!  


Also Read: Mahindra Scorpio-N Price: టయోటా ఫార్చ్యూనర్‌కు బదులుగా.. జనాలు ఈ చౌకైన ఎస్‌యూవీని కొంటున్నారు! రూ 20 లక్షలు ఆదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.