Mahindra Scorpio-N Price: టయోటా ఫార్చ్యూనర్‌కు బదులుగా.. జనాలు ఈ చౌకైన ఎస్‌యూవీని కొంటున్నారు! రూ 20 లక్షలు ఆదా

People are Savings of Rs 20 lakhs after buying Cheap SUV Mahindra Scorpio-N. బడ్జెట్ లేని, ఫార్చ్యూనర్ వంటి కారును కొనుగోలు చేయాలనుకునే వారికి మహీంద్రా స్కార్పియో-ఎన్ మంచి ఎంపిక.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 4, 2023, 08:57 PM IST
  • టయోటా ఫార్చ్యూనర్‌కు బదులుగా
  • జనాలు ఈ చౌకైన ఎస్‌యూవీని కొంటున్నారు
  • రూ 20 లక్షలు ఆదా
Mahindra Scorpio-N Price: టయోటా ఫార్చ్యూనర్‌కు బదులుగా.. జనాలు ఈ చౌకైన ఎస్‌యూవీని కొంటున్నారు! రూ 20 లక్షలు ఆదా

People are buying Cheap SUV Mahindra Scorpio-N instead of Toyota Fortuner: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 'టయోటా ఫార్చ్యూనర్' ప్రారంభ ధర రూ. 32.59 లక్షలు. అదేసమయంలో మహీంద్రా స్కార్పియో-ఎన్ ప్రారంభ ధర రూ. 12.74 లక్షలు మాత్రమే (ఎక్స్-షోరూమ్). అంటే రెండింటి ప్రారంభ ధరల్లో దాదాపు రూ.20 లక్షల వ్యత్యాసం ఉంది. డిజైన్, లుక్, సైజు, ఫీచర్లు మరియు సామర్థ్యాల కారణంగా టయోటా ఫార్చ్యూనర్‌ను కొనుగోలు చేయడానికి అందరూ ఆసక్తి చూపుతారు. అయితే బడ్జెట్ లేని, ఫార్చ్యూనర్ వంటి కారును కొనుగోలు చేయాలనుకునే వారికి మహీంద్రా స్కార్పియో-ఎన్ మంచి ఎంపిక. ప్రస్తుతం స్కార్పియో-ఎన్ మంచి డిమాండ్ ఉన్న ఎస్‌యూవీ. ఈ కారు వివరాలు ఓసారి చూద్దాం. 

మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) ధరల శ్రేణి రూ. 12.74 లక్షల - రూ. 24.05 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. మహీంద్రా స్కార్పియో-ఎన్ టాప్ వేరియంట్ ధర కూడా టయోటా ఫార్చ్యూనర్ బేస్ వేరియంట్ కంటే దాదాపు రూ. 8.5 లక్షలు తక్కువ. మహీంద్రా స్కార్పియో-ఎన్ కారు (Mahindra Scorpio-N Z2, Mahindra Scorpio-N Z4, Mahindra Scorpio-N Z6, Mahindra Scorpio-N Z8 మరియు Mahindra Scorpio-N Z8L) ఐదు ట్రిమ్‌లలో వస్తుంది. ఇది 6-సీటర్ మరియు 7-సీటర్ లేఅవుట్‌లో అందుబాటులో ఉంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఈ కారు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ రెండు పవర్ ట్యూనింగ్‌లతో వస్తుంది 132 PS/300 Nm మరియు 175 PS (370 Nm మరియు 400 Nm). ఈ కారు 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 203 PS (370 Nm మరియు 380 Nm) అవుట్‌పుట్‌లను ఉత్పత్తి చేయగలదు. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటాయి. 

మహీంద్రా స్కార్పియో-ఎన్ డీజిల్ ఇంజన్‌లో 4-వీల్ డ్రైవ్ ఎంపిక ఉండగా.. ఇది అన్ని పవర్‌ట్రెయిన్‌లతో స్టాండర్డ్‌గా రియర్-వీల్-డ్రైవ్ డ్రైవ్‌ట్రైన్‌ను పొందుతుంది. ఇది 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, సన్‌రూఫ్ మరియు సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా ఉన్నాయి. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ అసిస్ట్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read: Tata Safari EV 2023: టాటా సఫారి ఎలక్ట్రిక్ వెర్షన్ టెస్టింగ్ ప్రారంభం.. త్వరలోనే మార్కెట్‌లోకి!  

Also Read: WPL 2023: ఐపీఎల్ జట్లకు విదేశీ కెప్టెన్లు ఉండటం సరైంది కాదు.. అంజుమ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News