iPhone Offers in Amazon: ఐఫోన్‌కు ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్ ఇది. ఇందులో ఉన్న ఫీచర్లకు తగ్గట్లే.. వీటి ధరలు కూడా ఉంటాయి. అయితే చాలా మంది ధరలు ఎక్కువగా ఉన్నాయని.. ఐఫోన్ కొనలేమని బాధపడుతుంటారు. అలాంటి వారికి గుడ్‌న్యూస్. కొత్త మోడల్ ఐఫోన్ లాంచ్ చేసిన తర్వాత.. కంపెనీ పలు ఐఫోన్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఐఫోన్ కొన్ని మోడల్స్‌ గతంలో కంటే చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. కొత్త ఐఫోన్ 15 సిరీస్‌ను ప్రారంభించిన తరువాత ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ధరలను తగ్గించింది యాపిల్ కంపెనీ. ధరలు తగ్గింపుతో ఐఫోన్స్ లవర్స్ మొబైల్స్ కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఫోన్ 14 ప్లస్ ధర ఎంత తగ్గిందంటే..?


ఐఫోన్ 14 ప్లస్ ధరను 10 శాతం తగ్గిస్తున్నట్లు యాపిల్ కంపెనీ వెల్లడించింది. ఇంతకు ముందు రూ.89,900 ఉండగా.. ఈ ఫోన్ ఇప్పుడు రూ.79,900కి అందుబాటులో వచ్చింది. మీరు అమెజాన్‌లో కొనుగోలు చేసినట్లయితే.. ఈ ఫోన్‌పై మరిన్ని డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఐఫోన్ 14 ప్లస్ అమెజాన్‌లో రూ.76,990కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో రూ.40,750 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. 


ఐఫోన్ 14 ధర ఎంతంటే..?


ఐఫోన్ 14 ధరను భారీగా తగ్గించింది యాపిల్ కంపెనీ. ఇంతకుముందు రూ.79,900కి అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం రూ.69,900కి విక్రయిస్తోంది. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై మరిన్ని ఆఫర్లు ఇస్తున్నారు. ఐఫోన్ 14 అమెజాన్‌లో రూ.65,999కి లభిస్తోంది. అదనంగా మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి Amazon Payలో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ కూడా పొందొచ్చు.


ఐఫోన్ 13 ధర తగ్గింపు ఇలా..


ఐఫోన్ 13 ధర తగ్గింంది. ఇంతకుముందు ఈ ఫోన్ రూ.64,999కి విక్రయించగా.. ఇప్పుడు రూ.59,900కి అందుబాటులో వచ్చింది. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 13 అమెజాన్‌లో రూ. 55,999కి అందుబాటులోకి వస్తోంది. ఎక్స్‌ఛేంజ్‌పై రూ.40,750 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు.


ఐఫోన్ 14 ప్రో మొబైల్‌పై ఆఫర్


ప్రస్తుతం ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌లను నిలిపివేసింది. యాపిల్ స్టోర్ లేదా అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయడం సాధ్యం కాదు. అయితే ఈకామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఐఫోన్ 14 ప్రోపై రూ.9,901 తగ్గింపు ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు ఈ ఫోన్ రూ.129,900కి బదులుగా రూ.119,999కి అందుబాటులో ఉంది. హెడీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి అదనంగా రూ.3 వేల తగ్గింపును పొందొచ్చు.


Also Read: World Cup 2023: ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా నిలిచేదెవరు..? లెక్కలు ఇలా..!  


Also Read: Bigg Boss-7 Telugu: రెండో వారం ఎలాంటి ట్విస్టుల్లేవ్.. హౌస్ నుంచి ఆమె ఔట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook