Best 5G Smartphones Under 15,000: 15 వేల రూపాయల లోపు అద్భుత ఫీచర్లతో అత్యంత చౌకైన 5జి స్మార్ట్‌ఫోన్లు ఇవే!
Best 5G Smartphones in India 2023: దేశంలో 5జి అందుబాటులో వచ్చేసింది. చిన్నా పెద్ద నగరాల్లో 5జి సేవలు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో 5జి సేవలు పొందాలంటే..4జి నుంచి 5జి స్మార్ట్‌ఫోన్‌కు మారకతప్పదు. మరి 5జి స్మార్ట్ఫోన్ల ధరలు ఎక్కువని ఆలోచిస్తుంటే..ఇదే మీకు గుడ్‌న్యూస్.
Best 5G Smartphones Under Rs 15,000 in India: చౌకైన బెస్ట్ 5జి స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఈ ఆప్షన్ మీ కోసమే. ఎందుకంటే ఈ స్మార్ట్‌ఫోన్ ధర తక్కువే కాకుండా అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్ ఇది. ఇంతకంటే చౌకైన 50 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో లభించడం కష్టమే కాదు. లేదు కూడా. ఆ వివరాలు మీ కోసం..
మీ మొబైల్ నెట్ వినియోగాన్ని 4జి నుంచి 5జికు మారాలంటే ముందు మీ స్మార్ట్‌ఫోన్ 5జి అప్‌గ్రేడ్ అయుండాలి. లేదా 5జి స్మార్ట్‌ఫోన్ కొనాల్సి ఉంటుంది. మార్కెట్‌లో 5జి స్మార్ట్‌ఫోన్లు చాలా అందుబాటులో ఉన్నాయి. కానీ మీ బడ్జెట్ తక్కువైందని ఆలోచిస్తుంటే ఈ వివరాలు మీ కోసమే. మీరు అనుకున్న బడ్జెట్‌లోనే అద్భుతమైన ఫీచర్లు, కెమైరా, ప్రోసెసర్ కలిగిన స్మార్ట్‌ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అతి తక్కువ స్మార్ట్‌ఫోన్ గురించి వివరాలు పరిశీలిద్దాం.
Redmi 11 Prime 5G
Redmi 11 Prime 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.58 ఇంచెస్ ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటుంది. దీని రిజల్యూషన్ 2408/1080 పికెసల్ ఫుల్ హెచ్‌డి ప్లస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డ్యూడ్రాప్ నాచ్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా MIUI 13 సాఫ్ట్‌వేర్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. బ్లూటూత్ 5.1 తో పాటు మీడియాటెక్ డైమెన్షన్ చిప్ సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యముంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 16,490 రూపాయలు మాత్రమే
Moto G71 5G
Moto G71 5G లో 8 జీబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ఎమోల్డ్ డిస్‌ప్లేతో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉన్నాయి. డ్యూయల్ సిమ్ సౌకర్యం ఉంది. ప్రైమరీ సెన్సార్ ట్రిపుల్ కెమేరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా ఉన్నాయి. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర 16,999 రూపాయలు.
Also Read: Second Hand Cars: సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ఈ కారుకే డిమాండ్, ధర కేవలం 2.5 లక్షలే
Samsung Galaxy F23 5G
Samsung Galaxy F23 5G ఫోన్ దాదాపు 6.6 ఇంచెస్ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ ప్యానల్‌తో వస్తుంది. ఇందులో 2408 x1080 పిక్సెల్ రిజల్యూషన్ ఉంది. రిఫ్రెష్ రేట్ ఏకంగా 120 హెర్ట్జ్ ఉంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో సెక్యూర్ చేయబడి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750తో నడుస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 15,999 రూపాయలుంది.
POCO M4 Pro 5G
POCO M4 Pro 5Gలో 2400 x1080 పిక్సెల్ (FHD+) రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 6.5 ఇంచెస్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ డివైస్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 తో నడుస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పోకో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా యూనిట్ ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉండటమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉండటం మరో ప్రత్యేకత. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 14,999 రూపాయలు.
Also Read: Bal Jeevan Bima Yojana: రోజుకు కేవలం రూ.6 పెట్టుబడి పెట్టండి.. మీ పిల్లలను లక్షాధికారిని చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook