Bal Jeevan Bima Yojana: రోజుకు రూ.6 పెట్టుబడి పెట్టండి.. మీ పిల్లలను లక్షాధికారిని చేయండి

Children Best Post Office Scheme: పిల్లల భవిష్యత్ అవసరాల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం బాల్ జీవన్ బీమా యోజన. ఈ స్కీమ్‌లో డైలీ రూ.6 పెట్టుబడి పెట్టి మీ పిల్లలను లక్షాధికారిని చేయవచ్చు. ఎవరు అర్హులు..? ఎంత వయసు ఉండాలి..? పూర్తి వివరాలు ఇలా..

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2023, 12:38 PM IST
Bal Jeevan Bima Yojana: రోజుకు రూ.6 పెట్టుబడి పెట్టండి.. మీ పిల్లలను లక్షాధికారిని చేయండి

Rs 6 per day get Huge Money on this Scheme: సంపాదిస్తున్న రూపాయిలో భవిష్యత్‌ కోసం దాచిపెట్టుకోవడం తప్పనిసరిగా మారింది. ఎప్పుడు ఎలాంటి కష్టాలు వస్తాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా పెళ్లై అయి.. పిల్లలు ఉన్నవారు కచ్చితంగా భవిష్యత్ అవసరాల కోసం ప్రతి నెలా కొంత మొత్తంలో సేవింగ్స్ చేయాల్సిందే. పిల్లలు పెరిగి పెద్దవుతున్న చదువుల ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి. వచ్చే కొంత ఆదాయంతో కుటుంబ పోషణకు సరిపోక పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సి రావొచ్చు. మీరు ఇప్పటి నుంచే పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి ప్రతి నెలా కొంత మొత్తం డబ్బులు పొదుపు చేయడం మొదలు పెట్టండి. బాల్ జీవన్ బీమా పథకం డబ్బులు పొదుపు చేయడానికి మంచి ఎంపికగా చెప్పొచ్చు.

పోస్టాఫీసు ద్వారా బాల్ జీవన్ బీమా పథకంలో ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ప్రతి రోజు కేవలం రూ.6 పెట్టుబడి పెట్టి.. మీ పిల్లలను లక్షాధికారిని చేయవచ్చు. మీ పిల్లల చదువు ఖర్చుల కోసం ముందుగానే డబ్బును పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే తల్లిదండ్రుల వయసు 45 ఏళ్లు మించకూడదు. 45 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అనర్హులు. 5 నుంచి 20 సంవత్సరాల పిల్లల పేరుతో ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద తల్లిదండ్రులు తమ పిల్లలలో ఇద్దరికి మాత్రమే పాలసీని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ మూడో బిడ్డకు ఈ పథకం వర్తించదు. 

Also Read: Union Minister Kishan Reddy: మేం ప్రోటోకాల్ పాటించాం.. కేసీఆర్ కూర్చీని అందుకే తొలగించాం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బాల్ జీవన్ బీమా పథకంలో రోజుకు రూ.6 నుంచి రూ.18 వరకు ప్రీమియం డిపాజిట్ చేయవచ్చు. లక్ష రూపాయలతో హామీతో ప్రయోజనం లభిస్తుంది. పిల్లల వయసు ఐదేళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ డబ్బులు మొత్తం అందుతాయి. ఈ పథకంలో ప్రీమియం నెలవారీ.. త్రైమాసికం.. అర్ధ సంవత్సరం, ఏడాది ప్రాతిపదికన చెల్లించవచ్చు. ఈ పథకంలో లోన్ సదుపాయం లేదు. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించిన ఐదేళ్ల తరువాత సరెండర్ చేయవచ్చు. మీకు 1000 రూపాయల హామీ మొత్తంపై ప్రతి ఏడాది రూ.48 బోనస్ కూడా అందుతుంది.

మీరు బాల్ జీవన్ బీమా యోజన పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ముందు సమీపంలోని పోస్ట్‌ ఆఫీస్‌కు వెళ్లండి.  అక్కడ అధికారులను సంప్రదించి దరఖాస్ ఫామ్‌ను పూరించండి. తమ పిల్లల గురించి పూర్తి వివరాలు తెలియజేయండి. అంతేకాకుండా పాలసీదారుడి వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పించి.. ఖాతాను ఓపెన్ చేయండి.

Also Read: PM Modi Speech: సీఎం కేసీఆర్ టార్గెట్‌గా ప్రధాని మోదీ ప్రసంగం.. అవినీతిపరులపై చర్యలు ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News