COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Best Air Cooler Under 5,000: వేసవి కాలం ప్రారంభమయ్యింది. కొన్ని చోట్ల ఎండలు జోరుగా కొడుతున్నాయి. దీని కారణంగా వాతావరణంలో ఉష్టోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఈ ఉష్ణగ్రతలు ఎండలు తగ్గినప్పటికీ ఉక్కపోత తగ్గడం లేదు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలంతా ACలు, కూలర్స్‌ వైపు చూస్తున్నారు. చాలా మంది బడ్జెట్‌ లేనీ కారణంగా ఏసీలు కొనుగోలు చేయాలేకపోతున్నాయి. అలాగే మరికొంతమందైతే మిడ్‌ రేంజ్‌లో లభించే కూలర్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్‌లో రూ. 5000 కంటే తక్కువ ధర ఉన్న కొన్ని రూమ్‌ ఎయిర్ కూలర్‌ల బాగా సేల్‌ అవుతున్నాయి. అయితే మీరు కూడా తక్కువ ధరలోనే మంచి కూలర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం డెడ్ చీప్‌లో లభించే కోన్ని కూలర్స్‌ గురించి తెలియజేయబోతున్నాం.


తక్కువ ధరలో ఎక్కువ ఫృచర్స్‌ కలిగి కూలర్స్:
బజాజ్ PX25 ఎయిర్ కూలర్:

ఉక్కపోతను తగ్గించేందుకు ఇటీవలే బజాజ్ నుంచి ప్రీమియం ఫీచర్స్‌తో బజాజ్ PX25 ఎయిర్ కూలర్ మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. ఇది అనేక రకాల కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉంది. అలాగే ఈ కూలర్ యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్ సెటప్‌తో పాటు టర్బో ఫ్యాన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది 24 లీటర్ల సామర్థ్యంతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిని ఎక్కడికంటే అక్కడికీ తీసుకెళ్లేందుకు కాంపాక్ట్ డిజైన్‌తో పాటు ప్రత్యేమైన చక్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర  రూ. 4,649తో లభిస్తోంది. 


హింద్‌వేర్ స్మార్ట్ ఎయిర్ కూలర్:
పోర్టబుల్ బెస్ట్‌ ఎయిర్ కూలర్‌లో ఇది ఒకటిగా భావించవచ్చు. ఇది 25L సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇందులో కంపెనీ కరెంట్ బిల్ తగ్గించేందుకు ప్రత్యేకమైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో పాటు ఈ కూలర్‌ ఎక్కడైనా సులభంగా అమర్చేందుకు ప్రత్యేకమైన డిజైన్‌ కలిగి ఉంటుంది. ఇక ఈ హింద్‌వేర్ స్మార్ట్ ఎ ఇర్ కూలర్ ధర వివరాల్లోకి వెళితే, రూ. 4,490తో లభిస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


హావెల్స్ ఎయిర్ కూలర్:
ఇటీవలే హావెల్స్ కంపెనీ నుంచి కూడా ప్రత్యేకమైన కూలర్‌ లాంచ్‌ విడుదలైంది. ఇది పోర్టబుల్ వేరియంట్‌లో 32 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ కూలర్‌ చూడానిని ఎంతో స్టైలీష్‌గా ప్రత్యేకమై డీజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు అద్భుతమైన టెక్నాలజీతో దీనిని అందుబాటులోకి తీసుకవచ్చిన్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ కూలర్‌ ప్రస్తుతం మార్కెట్‌లో రూ.4,998కి లభిస్తుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి