COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme C55 Vs Motorola G82 5G: మీరు కూడా ఈ నెలలో మంచి ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మేము ఈ రోజు రూ.15,000లోపే రెండు మొబైల్స్‌ను తీసుకువచ్చాం. ఈ రెండు బడ్జెట్‌లో ప్రీమియం లుక్‌లో లభిస్తున్నాయి. ప్రస్తుతం Realme C55, MOTOROLA g82  5G స్మార్ట్‌ ఫోన్స్‌ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి చాలా మంది ఈ మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మీరు ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ ది బెస్ట్‌ మొబైల్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ Realme C55, MOTOROLA g82 5G స్మార్ట్‌ ఫోన్స్‌లో బెస్ట్‌ ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


డిజైన్‌:
ఈ Realme C55, MOTOROLA g82 5G స్మార్ట్‌ ఫోన్స్‌ పోలికలను మొదట డిజైన్‌తో ప్రారంభిద్దాం..డిజైన్‌ పరంగా మొదటి చూపులో మీరు Realme C55ని ఇష్టపడతారు. ఇది చూడడానికి గోల్డ్ కలర్‌లో ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. ఇక  MOTOROLA g82 5G మొబైల్‌ విషయానికొస్తే ఇది పాత డిజైన్‌ను కలిగి ఉంటుంది. మొబైల్‌ ప్రీమియం లుక్‌లో ఉండాలని కోరుకునేవారు ఫస్ట్‌ ఆప్షన్‌ను చూస్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 


డిస్ప్లే  వివరాలు:
ఇక ఈ మొబైల్స్‌ డిస్ప్లే  విషయానికొస్తే..Realme C55 6.72 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక MOTOROLA g82 5G 6.6 అంగుళాల పూర్తి HD+ ప్యానెల్‌తో అందుబాటులో ఉంది. డిస్‌ప్లే పరంగా రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ ఒకేలా ఉంటాయి. MOTOROLA పోలిస్తే రియల్‌ మీ పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 


పనితీరు:
పనితీరు పరంగా..ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ చాలా అద్భుతమైనవి చెప్పొచ్చు. రియల్ మీ మొబైల్‌ Helio G88 ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. ఇక Motorola g82 5G స్మార్ట్ ఫోన్‌ Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్‌పై పని చేస్తుంది. పనితీరులో భాగంగా రియల్‌ మీ కంటే మోటరోలా మొబైల్‌ కొంత ముందుంటుంది.


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..


కెమెరా:
Realme C55 స్మార్ట్‌ఫోన్‌ 64MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. Motorola g82 5G మొబైల్‌ 50MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ 16MP ఫ్రంట్ కెమెరాతో అందుబాటులో ఉంది.Realme మొబైల్‌ 64MP ప్రైమరీ కెమెరా చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ, ఇందులో కేవలం రెండు కెమెరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇందులో Motorola స్మార్ట్‌ ఫోన్‌దే పై చేయి..


ధర:
ధర విషయానికొస్తే, Realme C55 మొబైల్‌ 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌  8 GB ర్యామ్‌ వేరియంట్ రూ. 13,999కి అందుబాటులో ఉండగా..Motorola g82 5G 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 14,999కి అందుబాటులో ఉంది. మీకు 5G కావాలంటే మీరు Motorola తీసుకోవడం చాలా మేలు..ఇక డిజైన్‌ పరంగా Realme C55 మొబైల్‌ బాగుంటుంది. 


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter