OnePlus Nord N30 SE 5G: అదిరిపోయే ఫీచర్లతో OnePlus Nord N30 SE 5G.. బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్ ఫోన్ ఇదే..
OnePlus Nord N30 SE 5G Price and Features: తక్కువ బడ్జెట్‌లో 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. అదిరిపోయే ఫీచర్లతో OnePlus సరికొత్త మోడల్‌ను పరిచయం చేసింది. OnePlus Nord N30 SE 5G పేరుతో యూఏఈలో అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనుంది.
OnePlus Nord N30 SE 5G Price and Features: మరో సరికొత్త మోడల్‌ను OnePlus మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. OnePlus Nord N30 SE 5G కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అత్యధునిక ఫీచర్లతో తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్‌ను యూఏఈలో విడుదల చేయగా.. ధర రూ.13,560 గా నిర్ణయించింది. ఈ ఫోన్ మంచి క్వాలిటీ డిస్‌ప్లేతోపాటు కొత్త ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది 5000 mAh పవర్ ఫుల్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్, బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది. రూ.15 వేలలోపు బడ్జెట్‌లో ఫోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నవారికి మంచి ఆప్షన్. అయితే ప్రపంచ వ్యాప్తంగా లాంచింగ్ డేట్‌ను ఇంకా వెల్లడించలేదు.
ఫీచర్లు ఇవే...
OnePlus Nord N30 SE 5G 6.72 ఇంచెస్ ఫుల్ HD+ డిస్‌ప్లేతో వస్తుంది. పిక్సెల్ రిజల్యూషన్ 1080x2400 గా ఉంటుంది. 4GB RAM, ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 6020 చిప్‌సెట్ ద్వారా పవర్‌ను పొందుతుంది. 128 GB స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. మైక్రో SD కార్డ్‌ని యాడ్ చేసుకుంటే.. స్టోరేజ్‌ను మరింత ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌లో వర్క్ అవుతుంది. సిజన్‌ఓఎస్ 13.1 కూడా ఇన్‌బుల్ట్‌గా ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది.
ఈ ఫోన్‌కు బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు ఉన్నాయి. ఫస్ట్ కెమెరా 50 మెగాపిక్సెల్స్‌తో ఉంటుంది. ఎలాంటి లైటింగ్ పరిస్థితుల్లో అయినా క్వాలిటీ పిక్స్ తీస్తుంది. రెండో కెమెరా 2 మెగాపిక్సెల్‌తో ఉంటుంది. ఇది ఫొటోలను అందంగా తీస్తుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్‌తో వస్తుంది. మీరు సెల్ఫీలను చక్కగా తీసుకోవచ్చు.
OnePlus Nord N30 SE 5G ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ని అమర్చారు. మీరు ఫోన్‌ను సులభంగా అన్‌లాక్ చేయవచ్చు. అంతేకాకుండా స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఇది మంచి సౌండ్‌ను ఇస్తుంది. బ్యాటరీ పవర్ 5000 mAh కావడంతో ఎక్కువ కాలం వర్క్ అవుతుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో త్వరగా స్పీడ్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు.
Also read: CAA in India: సీఏఏపై మళ్లీ వివాదం, వారం రోజుల్లో అమలు చేస్తామని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
Also Read: Sharmila Meets Sunitha: షర్మిల మరో సంచలనం.. వివేకా కూతురు సునీతతో భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి