Boult Earbuds: బోల్ట్ మరో కొత్త ఇయర్ బడ్స్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు, 35 గంటల లాంగ్ బ్యాటరీతో పనిచేసే ఇయర్ బడ్స్ ధర ఎంతో తెలుసా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెస్ట్ ఇయర్ బడ్స్ గురించి ఎదురు చూస్తున్నారా..అయితే మీకొక గుడ్‌న్యూస్. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో ప్రముఖ బ్రాండ్ బోల్ట్ కొత్త ఇయర్ బడ్స్‌ను ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. Boult Maverick TWS Earbudsపేరుతో లాంచ్ అయిన ఈ ఇయర్ బడ్స్..ధర 2 వేల కంటే తక్కువే. అదే సమయంలో ఫీచర్లు మాత్రం ఎక్కువ. 35 గంటల బ్యాటరీ లైఫ్ ఈ ఇయర్ బడ్స్ ప్రత్యేకత. Boult Maverick TWS Earbuds ధర, ఇతర ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం..


Boult Maverick TWS Earbuds ప్రత్యేకత ధర తక్కువ. ఇండియాలో 1799 రూపాయలకు లాంచ్ చేసింది. ఇంకా ఈ ఇయర్ బడ్స్  అమ్మకాలు ఇండియాలో ప్రారంభం కాలేదు. సెప్టెంబర్ 15, 2022 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ , బోల్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యమౌతుంది. 


35 గంటల బ్యాటరీ బ్యాకప్


బోల్డ్ మావెరిక్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ యూజర్లకు 35 గంటల సేపు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఒక ఇయర్ బడ్ ఛార్జ్ చేసి ఏకధాటిగా 7 గంటలు వినియోగించవచ్చు. అంతేకాదు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కలిగి ఉంది. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే రెండు గంటల వరకూ పనిచేస్తాయి.


ఈ ఇయర్ బడ్స్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉన్నాయి. ఈకో నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచర్ మరో ప్రత్యేకత. అంతేకాకుండా..అద్భుతమైన సౌండ్ క్వాలిటీ, కంబాట్ టీఎం గేమింగ్ మోడ్ ఉన్నాయి. ఇందులో బ్లూ టూత్ 5.3 కనెక్టివిటీ కలిగి ఉంది. వాటర్ రెసిస్టెన్స్, ఏంబియెంట్ లైటింగ్ మరో ప్రత్యేకత.


Also read: Special Discount on iPhones: ఊహించని ధరకు ఐఫోన్ 13, ఐఫోన్ 11, ఐఫోన్ 12 మినీ, ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook