Best Smart Phone Under 10000: మిడ్‌ రేంజ్‌ మొబైల్‌ ఫోన్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెక్‌ కంపెనీలు కూడా మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇటీవలే బడ్జెట్‌లో వీవో విడుదల చేసిన Vivo Y02t స్మార్ట్‌ ఫోన్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించింది. అతి ధరలో ఎక్కువ ఫీచర్స్‌తో ఈ స్మార్ట్‌ ఫోన్‌ లభించడంతో విక్రయాలు జోరుగా సాగాయి. అయితే ఈ Vivo Y02t స్మార్ట్‌ ఫోన్‌పై భారీ తగ్గింపుతో పొందాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఆమెజాన్‌ ఈ మొబైల్‌ ఫోన్‌పై ప్రత్యక తగ్గింపు లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో..దీనికి సంబంధించిన ఫీచర్స్‌ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఈ మొబైల్‌ ఆమెజాన్‌లో 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తోంది. మొదట ఈ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ రూ.15,999లకు విక్రయించింది. అయితే అమెజాన్‌ మిడిల్‌ క్లాస్‌ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని 38 శాతం తగ్గించింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ. 9,999లకు లకే లభిస్తోంది. 


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్


అంతేకాకుండా ఈ Vivo Y02t మొబైల్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. సీటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగించి ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ Vivo Y02t స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ. 8,999లకే పొందవచ్చు. ఈ మొబైల్‌ ఫోన్‌ మరింత తగ్గింపుతో పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగించాల్సి ఉంటుంది. మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ ఎక్చేంజ్‌ చేసి ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ. 9,300 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను కేవలం రూ. 600లకే పొందవచ్చు. అంతేకాకుండా ఇంకా మరెన్నో బ్యాంకుల క్రెడిట్‌ కార్డ్‌లపై ఈ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 


Vivo Y02t ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
Vivo Y02t మొబైల్‌ 1600x720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.51 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ ఫోన్‌ 4 GB ర్యామ్‌, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. ఇక ప్రాసెసర్‌ విషయానికొస్తే..ఈ మొబైల్‌ ఫోన్‌ MediaTek Helio P35 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం..బ్యాక్‌ సెటప్‌లో LED ఫ్లాష్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ కెమెరా కలిగి ఉంటుంది. సెల్ఫీకోసం ఈ స్మార్ట్‌ ఫోన్‌ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. 


ఇతర స్పెసిఫికేషన్‌లు:
5000mAh బ్యాటరీ
10W ఛార్జింగ్‌ సపోర్ట్‌ 
Funtouch OS 13
Android 13
బ్లూటూత్ 5.0
USB 2.0
డ్యూయల్ సిమ్ సపోర్ట్


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి