CMF by Nothing Phone 1 Price Down: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ నథింగ్‌ మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించింది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లో అందుబాటులోకి రావడంతో, ఆకర్శనీయమైన LED లైట్‌ సెటప్‌ ఉండడంతో చాలా మంది యువత ఈ బ్రాండ్‌ మొబైల్స్‌ను కొనుగోలు చేశారు. అయితే ఈ కంపెనీ CMF అనే మరో సబ్‌ బ్రాండ్‌తో కొత్త మొబైల్‌ లాంచ్‌ చేసింది. ఇది కూడా చూడడానికి ఎంతో ఆకర్శనీయమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా కంపెనీ దీని బ్యాక్‌ సెటప్‌లో ప్రత్యేకమైన స్క్రూ సెటప్‌ను కూడా అందించింది. ఇవే కాకుండా బోలెడు ఫీచర్స్‌ను అందిస్తోంది. ఇదిలా ఉంటే CMF స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
    
ఫ్లిఫ్‌కార్ట్‌లో గోట్‌ సేల్‌ మొదలైంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు కొన్ని మొబైల్‌పై ప్రత్యకమైన బ్యాంక్‌ డిస్కౌంట్‌, ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా లభిస్తోంది. ప్రస్తుతం ఈ CMF నథింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు మూడు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. అయితే 6GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ MRP రూ.19,999 ధరలో లభిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ CMF స్మార్ట్‌ఫోన్‌ను గోట్‌ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 20 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఈ మొబైల్‌ను రూ.15,999కే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌తో కొనుగోలు చేయాలనుకుంటున్న వారు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా వన్‌ కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించేవారికి కూడా భారీ డిస్కౌంట్‌ పొందవచ్చు. అయితే ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.14,999కే లభిస్తుంది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


CMF స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ వినియోగించాలనుకునేవారు ముందుగా వినియోగిస్తున్న పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.13,000 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌ అనేది పాత స్మార్ట్‌ఫోన్‌ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. దీంతో ఆఫర్స్‌ అన్ని పోను ఈ మొబైల్‌ను రూ.1,999కే పొందవచ్చు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి