Elon Musk X-mail: టెస్లా సీఈవో బిలియనీర్ ఎలన్ మస్క్.. తన ఫ్లాట్ ఫారం ఎక్స్.. Xmail అనే..ఒక కొత్త ఈమెయిల్ ఫీచర్ను ప్రారంభవించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సాధారణంగా జీమెయిల్ ఎంతలా ఉపయోగపడుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ జీమెయిల్ ను ఉచితంగా పొందలేని పరిస్థితి. ఆండ్రాయిడ్ మొబైల్స్ వరకు ఉచితంగా మనం ఈ జీ మెయిల్ ను ఉపయోగించినా..విదేశాలలో అలాగే ఇతర ఆఫీస్ పనుల కోసం  కచ్చితంగా డబ్బు చెల్లించాల్సిందే . జిమెయిల్ లో ఉండే కొన్ని ఫీచర్లను మనం ఉపయోగించాలి అంటే అదనపు చార్జీలు తప్పని పరిస్థితి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Gold Rate Today: శుభవార్త..మరోసారి తగ్గిన బంగారం ధర..తులం ఎంత తగ్గిందంటే?  


ఈ క్రమంలోని ట్విట్టర్ ను.. కాస్త ఎక్స్ గా మార్చేసి ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఎలన్ మస్క్ ..ఇకపై జీ మెయిల్ కి పోటీగా ఎక్స్ మెయిల్ అనే ఒక కొత్త ఫీచర్ ని తీసుకు రాబోతున్నట్లు సమాచారం.  తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం ఒక ఎక్స్ వినియోగదారు డాడ్జ్ డిజైనర్ Xmail పేరిట ఒక మెయిల్ ఆప్షన్ తీసుకొస్తే ప్రతి ఒక్కరికి సులభం అవుతుంది అని కోరగా దీనికి ఎలన్ మస్క్ స్పందించి నా ఆలోచనలలో ఇది కూడా ఒకటి త్వరలోనే ప్రారంభిస్తాము అంటూ రిప్లై ఇచ్చారు 


ఇకపోతే ఎక్స్ మెయిల్ ప్రారంభించిన తర్వాత.. ఇది కూడా ఇతర ఈమెయిల్ సేవలతో పోటీ పడుతుంది అని కూడా ఆయన సమాధానం ఇచ్చారు.  ముఖ్యంగా జిమెయిల్ కి పోటీగా ఎక్స్ మెయిల్ రాబోతోంది అని తెలిపారు. ఇప్పటికే ఆపిల్ మెయిల్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దీని వినియోగం కూడా ఇప్పుడు ఎక్కువగానే ఉంది. సెప్టెంబర్ 2024 నాటికి 53.6% వాటాతో ఆపిల్ మెయిల్ ప్రస్తుతం ప్రపంచ ఈమెయిల్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తూ ఉండగా జిమెయిల్ కేవలం 30.7% మాత్రమే కలిగి ఉంది.ఇతర ప్రసిద్ధ దేశాలలో ఔట్ లుక్ 4.38%, యాహు! మెయిల్ 2.6 4% అలాగే గూగుల్ ఆండ్రాయిడ్ 1.72% వాటా మాత్రమే కలిగి ఉన్నాయి.


ఎలన్ మస్క్ రూపొందించే ఈ ఎక్స్ మెయిల్ పూర్తిగా ఉచితం. ఈ ఉచిత ఈమెయిల్ కూడా త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురండి అంటూ కొంతమంది ఎక్స్ వినియోగదారులు కోరారు.. ఎక్స్ మెయిల్ కార్యరూపం.. దాల్చినట్లయితే ప్రపంచ ఈమెయిల్ పరిశ్రమకు ఘననీయంగా అంతరాయం కలిగే అవకాశం ఉంది.ఇక ఎక్స్ ను  విస్తరించాలని ఎలన్ మస్క్ యొక్క దృష్టి ప్లాట్ఫారంను ప్రతిదీ యాప్ గా మార్చాలనే ఆయన లక్ష్యాన్ని నెరవేరుస్తుంది.


 


Also Read: Cold Waves: చలి చంపేస్తోంది.. రెండు రోజులు జాగ్రత్త, ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ..  


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter