Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభానికి ముందే అద్భుత ఆఫర్లతో అదరగొడుతోంది. POCO F4 5G స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 మరి కొద్దిరోజుల్లో అంటే సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు ముందే కొన్ని బ్రాండెడ్ స్మార్ట్‌‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి. ఇందులో భాగంగా అద్బుత ఫీచర్లు కలిగిన POCO F4 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 21,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. 


POCO F4 5G స్మార్ట్‌ఫోన్ జూన్ నెలలో 27,999 రూపాయల ప్రారంభ ధరకు లాంచ్ అయింది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కంటే ముందే ఈ ఫోన్ 21,999 రూపాయలకు లభ్యం కానుంది. పోకో అనేది అత్యంత ప్రాచుర్యం కలిగిన స్మార్ట్‌ఫోన్. POCO F4 5G ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


POCO F4 5G మూడు మోడల్స్‌లో లభిస్తోంది. 6జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఈ మోడల్స్ ధరలు వరుసగా 27,999 రూపాయలు, 29,999 రూపాయలు, 33,999 రూపాయలుగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ సందర్భంగా POCO F4 5G కేవలం 21,999 రూపాయలకే లభించనుంది. ఇది కాకుండా ఇతర ఎక్స్చేంజ్, బ్యాంక్ ఆఫర్లు వర్తిస్తాయి.


POCO F4 5G ఫీచర్లు


POCO F4 5Gలో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ 120 హెర్ట్జ్ ఎమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 870 చిప్, 67 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఇందులో 20 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మైక్రో ట్రిపుల్ కెమేరా యూనిట్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది.


ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సెప్టెంబర్ 23 న ప్రారంభమై..సెప్టెంబర్ 30 వరకూ ఉంటుంది. ఈ సేల్‌లో POCO F4 5G ,POCO X4 Pro, M4 Pro, M5,M4 5G ఫోన్లపై కూడా ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయి. 


Also read: flipkart Offers: 13 వేల ఇన్ఫినిక్స్ హాట్ 12 స్మార్ట్‌ఫోన్ కేవలం 450కే..ఎలాగంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook